Midhani Hyderabad Recruitment 2021:The Mishra Dhatu Nigam Limited (Midhani) has released a recruitment notification. The notification is for the recruitment of Executive and Non Executive posts.
మిశ్రథాతు నిగమ్ లిమిటెడ్(మిథాని), హైదరాబాద్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఎగ్జిక్యూటీవ్, నాన్ ఎగ్జిక్యూటీవ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.
మిశ్రథాతు నిగమ్ లిమిటెడ్(మిథాని), హైదరాబాద్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఎగ్జిక్యూటీవ్, నాన్ ఎగ్జిక్యూటీవ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 20 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందులో ఎగ్జిక్యూటీవ్ 13, నాన్ ఎగ్జిక్యూటీవ్ విభాగంలో 7 ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైల్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జిక్యూటీవ్ పోస్టులకు ఈ నెల 24లోగా, నాన్ ఎగ్జిక్యూటీవ్ ఉద్యోగాలకు మార్చి 31లోగా అప్లై చేయాలని నోటిఫికేషన్లో సూచించారు. అప్లై చేసుకునే సమయంలో అభ్యర్థులు రూ.100ను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
ఎగ్జిక్యూటీవ్ విభాగంలో 13 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో రెండు జూనియర్ మేనేజర్ల ఉద్యోగాలు ఉన్నాయి. ఇందులో సివిల్ 1, లీగల్ లో మరో ఖాళీ ఉంది. సివిల్ లో బీఈ/బీటెక్ చేసిన వారు, లా డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు. ఇంకా 11 అసిస్టెంట్ మేనేజర్(హాట్ రోలింగ్ మిల్స్, 3, స్ప్రింగ్ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ 1, బార్ అండ్ వైర్ డ్రాయింగ్ 1, మెకానికల్ మెయింటెనెన్స్ 3, ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్-3) ఖాళీలు ఉన్నాయి. ఆయా విద్యార్హతలను నోటిఫికేషన్లో చూడొచ్చు. రాత పరీక్ష, ప్రొఫిషియెన్సీ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నరు. జూనియర్ మేనేజర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 30 వేలు, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 40 వేల వేతనం చెల్లించనున్నారు.
నాన్ ఎగ్జిక్యూటీవ్:
ఈ విభాగంలో ఏడు ఖాళీలు ఉన్నాయి. ఇందులో రోల్ ఆపరేటర్-2, వాకింగ్/రోలర్ హెల్త్ ఫర్నేస్ ఆపరేటర్లు 2, హాట్/కోల్డ్ లెవల్ ఆపరేటర్ 1, ఈఓటీ క్రేన్ ఆపరేటర్ పోస్టుల్లో మరో రెండు ఖాళీలు ఉన్నాయి. క్రేన్ ఆపరేట్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. క్రేన్ ఆపరేటింగ్ లో నాలుగేళ్ల అనుభవం ఉండాలి. సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ చేసి రెండేళ్ల అనుభవం ఉన్న వారు కూడా ఈ పోస్టుకు అప్లై చేయొచ్చు. మిగిలిన పోస్టులకు మెకానికల్/మెటలర్జీ సబ్జెక్టుల్లో డిప్లొమోలో ఫస్ట్ క్లాస్ లో పాసై, నాలుగేళ్ల అనుభవం ఉన్న వారు అప్లై చేయొచ్చు. ఇతర వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. క్రేన్ ఆపరేటర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 20 వేలు, ఇతర ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.21,900 పాటు వేతనం చెల్లించనున్నారు.
No comments:
Post a Comment