NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Mar 31, 2021

JVK KITS New Guidelines-2021

  NewNotifications       Mar 31, 2021

JVK KITS New Guidelines-2021

సమగ్ర శిక్షా - 'జగనన్న విద్యాకానుక' విద్యార్థులకు కిట్ల పంపిణీలో భాగంగా బూట్ల పంపిణీ కొరకు విద్యార్థుల పాదాల కొలతలను సేకరించి - నమోదు చేయుట కొరకు ప్రభుత్వ ఉత్తర్వులు 21, పాఠశాల విద్య, తేది 10-3-2021

1.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'జగనన్న విద్యాకానుక' పథకం కింద స్టూడెంట్ కిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ పథకం రెండో ఏడాది అమలులో భాగంగా 2021-22 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతోన్న అందరు విద్యార్థులకు సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో 'జగనన్న విద్యాకానుక' పేరుతో స్టూడెంట్ కిట్లు సరఫరా చేయడం జరుగుతుంది.

2. ఇందులో భాగంగా ఒక్కో విద్యార్థికి కిట్ లో 3 జతల యూనిఫాంలకి అవసరమైన క్లాతు, ఒక సెట్ నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, డిక్షనరీ, బ్యాగు ఉంటాయి.

3. ప్రతి విద్యార్థికి బూట్లు పంపిణీ చేసే ప్రక్రియలో భాగంగా 'బూట్లు సైజు సరిగా ఉండకపోవడం' పంటి సమస్యలు ఎదురుకాకుండా ఉండటానికి విద్యార్థుల నుంచి స్వయంగా పాద కొలతలు తీసుకోవడానికి ఈ కింది సూచనలు పొందుపరచడమైనది.

విద్యార్థుల పాద కొలతలు నమోదులో పాటించవలసిన సూచనలు

రాష్ట్రంలోని విద్యా, సంక్షేమ శాఖలకు చెందిన ప్రభుత్వ / మండల పరిషత్ / జిల్లా పరిషత్ / మున్సిపల్ / కేజీబీవీ /మోడల్ స్కూల్స్/ ఆశ్రమ/రెసిడెన్షియల్ /ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న అమ్మాయిల, అబ్బాయిల పాదాల కొలతలు తీసుకోవాలి. ఇందుకోసం ప్రధానోపాధ్యాయులు/ తరగతి ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు/ పార్ట్ టైమ్ ఇనస్టక్టర్లు, స్థానిక సిబ్బంది బాధ్యత తీసుకోవాలి.
  • ప్రస్తుతం పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల వివరాలు సేకరించవలసిన అవసరం లేదు.
  • విద్యార్థుల పాదాల కొలతలను ఆన్ లైన్ ద్వారా నమోదు చేసే బాధ్యత ప్రధానోపాధ్యాయులకు అప్పగించడమైనది. ఏ పి టీచర్స్. ఇన్  వెబ్సైటు 
  • లాగిస్ వివరాల కోసం https://cse.ap.gov.in/ వెబ్ సైటులో సందర్శించాలి.
ముఖ్యంగా చేయవలసినవి విద్యార్థుల పాదాల కొలతలు తీసుకునేటప్పుడు ముఖ్యంగా పరిగణనలోకి తీసుకోవలసిన అంశం: 
  • విద్యార్థుల పాదాల కొలతలను “సెంటీమీటర్ల'లో మాత్రమే తీసుకోవాలి.
  • విద్యార్థుల పాదాల కొలతలు తీసుకున్న తర్వాత వాటిని హెచ్ఎం లాగిన్లో నమోదు చేయవలసి ఉంటుంది. 
  • విద్యార్థుల పాదాల కొలతలు తీసుకునేటప్పుడు కోవిడ్ - 19ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఆదేశాలు తప్పకుండా ఆచరిస్తూ భౌతికదూరం పాటించడం, శానిటైజర్, హేండ్ వాష్ వంటివి తప్పక వినియోగించి తగిన జాగ్రత్తలు వహించాలి.
  • శానిటైజర్ వంటి వాటికోసం పాఠశాల కాంపోజిట్ నిధులు వినియోగించుకోవాలి.

నమోదు ఇలా

  • విద్యార్థుల పాదాల కొలతలు తీసుకోవడానికి సాధారణ స్కేలుతో కొలవాలి.
  • విద్యార్థుల పాదాలని పైన బొమ్మలో చూపించిన విధంగా స్కేల్ ఉపయోగించి కొలతలు తీసుకోవాలి.
  • పైన పేర్కొన్న విధంగా A నుండి B వరకు గల కొలతలని సెంటీమీటర్లలో తీసుకోవాలి. 
  • కొలతలు తీసుకున్న తర్వాత విద్యార్థుల పాదాల కొలతలన్నీ ఆన్లైన్లో పొందుపరచడానికి హెచ్ఎం లాగిన్ ఓపెన్ చేయాలి. 
  • హెచ్ఎం లాగిన్ ఓపెన్ చేయగానే పాదాల కొలతలు నమోదు చేయడానికి పాఠశాల, విద్యార్థుల పేర్లు వంటి వివరాలతో ప్రత్యేక స్క్రీన్ కనిపిస్తుంది.
  • విద్యార్థుల వివరాలు పక్కనే నైజ్ ఆప్షన్ బాక్సులో వారి పాదాల కొలతలు సెంటీమీటర్లలో నింపాలి. 
  • విద్యార్థుల పాదాల కొలతల వివరాలన్నీ హెచ్ఎం లాగిన్లో 07.04.2021 వ తేదీ లోపు పొందుపరచాలి.
  • ఈ కార్యక్రమం పాఠశాలలో తరగతి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో జరగాలి.
  • స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో సీఆర్పీలు ఈ కార్యక్రమం కచ్చితంగా, సక్రమంగా జరిగేలా బాధ్యత వహించాలి.
  • మండల స్థాయిలో సంబంధిత మండల విద్యాశాఖాధికారి బాధ్యత వహించాలి
  • జిల్లా స్థాయిలో డిప్యూటి జిల్లా విద్యాశాఖాధికారులు, జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్లు పర్యవేక్షిస్తూ ఈ కార్యక్రమం సక్రమంగా జరిగేలా బాధ్యత వహించాలి. 
పై సమాచారం పూర్తి అవ్వగానే సంబంధిత సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ వారు ఈ కార్యాలయంనకు నివేదిక రూపంలో 07.04.2021 తేదీలోపు పంపవలసిందిగా తెలియజేయడమైనది. హెచ్ఎం లాగిన్లో నమోదు చేసేటప్పుడు ఏవైనా సందేహాలు, సమస్యలు ఎదురైతే కార్యాలయపు పని వేళల్లో హెల్ప్ లైన్ నంబర్ 91211 48062 కు సంప్రదించగలరు. పైన తెలపబడిన ఆదేశములు అతి జరూరుగా భావించి నిర్దేశించిన సమయంలోపల పొందుపరచగలరు. లేని యెడలు తగు చర్యలు తీసుకోబడును. 

logoblog

Thanks for reading JVK KITS New Guidelines-2021

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...