NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Mar 16, 2021

Jobs in Metro: UPMRCL Recruitment 2021

  SSK       Mar 16, 2021

Jobs in Metro | మెట్రో రైల్‌లో ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. ఉత్తర్ ప్రదేశ్ మెట్రో రైల్‌లో ఉద్యోగాలు ఉన్నాయి. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

నిరుద్యోగులకు శుభవార్త. ఉత్తర్ ప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్-UPMRCL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ మేనేజర్, స్టేషన్ కంట్రోలర్, మెయింటైనర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 292 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 ఏప్రిల్ 2 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ఉత్తర్ ప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ https://lmrcl.com/ లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అప్లై చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.

UPMRCL Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే

మొత్తం ఖాళీలు- 292

  • అసిస్టెంట్ మేనేజర్ / ఆపరేషన్స్- 06
  • స్టేషన్ కంట్రోలర్ కమ్ ట్రైన్ ఆపరేటర్ (SCTO)- 186
  • మెయింటైనర్ (ఎలక్ట్రికల్)- 52
  • మెయింటైనర్ (ఎస్ అండ్ టీ)- 24
  • మెయింటైనర్ (సివిల్)- 24

UPMRCL Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన తేదీలు

  • నోటిఫికేషన్ విడుదల- 2021 మార్చి 3
  • దరఖాస్తు ప్రారంభం- 2021 మార్చి 11
  • దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఏప్రిల్ 2
  • అడ్మిట్ కార్డుల విడుదల- 2021 ఏప్రిల్ 10
  • కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్- 2021 ఏప్రిల్ 17

UPMRCL Recruitment 2021: విద్యార్హతల వివరాలు ఇవే

  • అసిస్టెంట్ మేనేజర్ / ఆపరేషన్స్- ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో బీఈ లేదా బీటెక్ 60 శాతం మార్కులతో పాస్ కావాలి.
  • స్టేషన్ కంట్రోలర్ కమ్ ట్రైన్ ఆపరేటర్ (SCTO)- ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్‌లో మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా పాస్ కావాలి.
  • మెయింటైనర్ (ఎలక్ట్రికల్)- ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.
  • మెయింటైనర్ (ఎస్ అండ్ టీ)- ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.
  • మెయింటైనర్ (సివిల్)- ఫిట్టర్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.

logoblog

Thanks for reading Jobs in Metro: UPMRCL Recruitment 2021

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...