ircon.org: భారతీయ రైల్వేకు చెందిన నిర్మాణ సంస్థ అయిన ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ జాబ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 74 వర్క్స్ ఇంజనీర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. సివిల్, ఎస్ అండ్ టీ విభాగాల్లో ఈ పోస్టులున్నాయి. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. ఏప్రిల్ 18 దరఖాస్తులకు చివరి తేదీ.
Amazon Smartphone Upgrade Days sale
ప్రధానాంశాలు:
- 74 వర్క్స్ ఇంజనీర్ పోస్టులు
- ఇంజినీరింగ్ పాసైన వాళ్లు అర్హులు
- ఏప్రిల్ 18 దరఖాస్తులకు చివరితేది
మొత్తం ఖాళీలు- 74
- వర్క్స్ ఇంజనీర్ సివిల్- 60
- వర్క్స్ ఇంజనీర్ ఎస్ అండ్ టీ- 14
ముఖ్య సమాచారం:
విద్యార్హతలు:
సివిల్ ఇంజనీర్ పోస్టులకు సివిల్ ఇంజనీరింగ్‌లో ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ 60 శాతం మార్కులతో పాస్ కావాలి. సివిల్ కన్‌స్ట్రక్షన్స్ వర్క్స్‌లో కనీసం ఏడాది అనుభవం ఉండాలి. వర్క్స్ ఇంజనీర్ ఎస్ అండ్ టీ పోస్టుకు ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ 60 శాతం మార్కులతో పాస్ కావాలి. రైల్వే సిగ్నలింగ్ వర్క్స్ లేదా ఓఎఫ్‌సీ బేస్డ్ కమ్యూనికేషన్ అండ్ నెట్వర్కింగ్ సిస్టమ్స్‌లో ఏడాది అనుభవం ఉండాలి.
వయస్సు:
అభ్యర్థులకు 30 ఏళ్ల లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: అభ్యర్థులను 1:7 ప్రకారం కేటగిరీ వారీగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. క్వాలిఫికేషన్, మార్కులు, అనుభవం లాంటివి పరిగణలోకి తీసుకుంటారు. వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు.
వేతనం: రూ.36,000.
దరఖాస్తు ప్రారంభం: మార్చి 23, 2021
దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 18, 2021
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్: DGM/HRM, Ircon International Ltd. C-4, District Centre, Saket, New Delhi - 110017.
వెబ్‌సైట్:https://ircon.org/
No comments:
Post a Comment