ESIC Recruitment 2021 | నిరుద్యోగులకు శుభవార్త. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్-ESIC భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.
- ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్-ESIC భారీ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ చేపట్టబోతోంది. అప్పర్ డివిజన్ క్లర్క్-UDC, స్టెనోగ్రాఫర్ లాంటి పోస్టుల భర్తీకి ఈఎస్ఐసీ త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
- మొత్తం 6,552 పోస్టుల్ని భర్తీ చేయనుంది. అందులో అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులు 6,306, స్టెనోగ్రాఫర్ పోస్టులు 246 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన విద్యార్హతలు, ఇతర వివరాలన్నీ డీటెయిల్డ్ నోటిఫికేషన్‌లో ఉంటాయి.
- ఈ పోస్టులకు విద్యార్హతల వివరాలు చూస్తే స్టెనోగ్రాఫర్ పోస్టుకు 12వ తరగతి పాస్ కావాలి. కంప్యూటర్‌కు సంబంధించిన పరిజ్ఞానం ఉండాలి. ఇంగ్లీష్, హిందీలో నిమిషానికి 80 పదాలు టైప్ చేయగలగాలి.
- ఇక అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టుకు డిగ్రీ పాస్ కావాలి. కంప్యూటర్‌కు సంబంధించిన పరిజ్ఞానం ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్ల లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
- ఎంపికైన వారికి వేతనం రూ.25,500 ఉంటుంది. వేతనంతో పాటు డీఏ, హెచ్ఆర్ఏ లాంటివి ఉంటాయి.
- ఆసక్తి గల అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ వివరాల కోసం esic.nic.in వెబ్‌సైట్ ఫాలో అవుతూ ఉండాలి. మార్చి చివరివారం లేదా ఏప్రిల్ మొదటివారంలో నోటిఫికేషన్ విడుదల కావొచ్చు.
No comments:
Post a Comment