NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Mar 29, 2021

Eklavya Model School Recruitment 2021

  NewNotifications       Mar 29, 2021

Eklavya Model School Recruitment 2021 | దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ పాఠశాలల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీలున్నాయి. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

ఉపాధ్యాయ వృత్తి ఎంచుకున్నవారికి శుభవార్త. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారీగా టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయబోతోంది. దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లల్లో (Eklavya Model Residential Schools) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్-PGT, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్-TGT పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దేశవ్యాప్తంగా మొత్తం 3479 పోస్టుల్ని ప్రకటించింది. తెలంగాణలో 262, ఆంధ్రప్రదేశ్‌లో 117 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 1న మొదలు కానుంది. అదే రోజున దరఖాస్తు లింక్ యాక్టివేట్ అవుతుంది. అప్లై చేయడానికి 2021 ఏప్రిల్ 30 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://tribal.nic.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఎలా దరఖాస్తు చేయాలన్న వివరాలు ఏప్రిల్ 1న ఈ వెబ్‌సైట్‌లో ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ మాత్రమే ఫాలో కావాలి. దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.

Amazon Smartphone Upgrade Days sale

Eklavya Model School Recruitment 2021: పోస్టుల వారీగా ఖాళీల వివరాలు ఇవే

మొత్తం ఖాళీలు- 3479

ప్రిన్సిపాల్- 175

వైస్ ప్రిన్సిపాల్- 116

పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్- 1244

ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్- 1944

Amazon: Upto 50% off on Air Conditioners

Eklavya Model School Recruitment 2021: రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు ఇవే

మొత్తం ఖాళీలు- 3479

తెలంగాణ- 262 (ప్రిన్సిపాల్- 11, వైస్ ప్రిన్సిపాల్- 6, పీజీటీ- 77, టీజీటీ- 168)

ఆంధ్రప్రదేశ్- 117 (ప్రిన్సిపాల్- 14, వైస్ ప్రిన్సిపాల్- 6, టీజీటీ- 97)

చత్తీస్‌గఢ్- 514

గుజరాత్- 161

హిమాచల్ ప్రదేశ్- 8

ఝార్ఖండ్- 208

జమ్మూ అండ్ కాశ్మీర్- 14

మధ్య ప్రదేశ్- 1279

మహారాష్ట్ర- 216

మణిపూర్- 40

మిజోరం- 10

ఒడిశా- 144

రాజస్తాన్- 316

సిక్కిం- 44

త్రిపుర- 58

ఉత్తర్ ప్రదేశ్- 79

ఉత్తరాఖండ్- 9

Amazon: Upto 50% off on Beds, Wardrobes, Sofas & more

Eklavya Model School Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

దరఖాస్తు ప్రారంభం- 2021 ఏప్రిల్ 1

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఏప్రిల్ 30

పరీక్ష తేదీ- జూన్ మొదటి వారం

విద్యార్హతలు- ప్రిన్సిపాల్ పోస్టుకు ఏదైనా స్కూలింగ్ సబ్జెక్ట్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పాస్ కావాలి. లేదా టీచింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసి ఉండాలి. 10 ఏళ్లు ఇంగ్లీష్ మీడియం హయ్యర్ సెకండరీ స్కూల్ టీచర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. టీజీటీ, పీజీటీ పోస్టుకు మాస్టర్స్ డిగ్రీతో పాటు బీఈడీ పాస్ కావాలి.

ఎంపిక విానం- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ.

Amazon FAB FEST SALE: Footwear- Upto 70% off

కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రస్తుతం 288 స్కూల్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మరో 452 స్కూళ్లను ప్రారంభిస్తోంది. దీంతో మొత్తం స్కూళ్ల సంఖ్య 740 కి చేరుకోనుంది. ఇప్పటికే రాష్ట్రాల నుంచి 100 పాఠశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు అందాయి. త్వరలో స్కూళ్ల నిర్మాణం ప్రారంభం కానుంది.

logoblog

Thanks for reading Eklavya Model School Recruitment 2021

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...