BECIL Recruitment 2021 | ఇంటర్, బీటెక్, డిగ్రీ, పీజీ పాస్ అయినవారికి గుడ్ న్యూస్. బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్-BECIL పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.
బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్-BECIL పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పర్సనల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టాఫ్ నర్స్, లిఫ్ట్ ఆఫరేటర్, వార్డ్ అటెండెంట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 56 పోస్టులన్నాయి. న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద-AIIA కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది BECIL. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అప్లై చేయడానికి 2021 మార్చి 29 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు https://becilregistration.com/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.becil.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
BECIL Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే
మొత్తం ఖాళీలు- 56
- పర్సనల్ అసిస్టెంట్- 1
- డేటా ఎంట్రీ ఆపరేటర్- 3
- ఆపరేషన్ థియేటర్ నర్స్- 3
- స్టాఫ్ నర్స్- 11
- మ్యూజియం కీపర్- 1
- మిడ్ వైఫ్- 4
- పంచకర్మ టెక్నీషియన్- 7
- పంచకర్మ అటెండెంట్- 12
- లిఫ్ట్ ఆపరేటర్- 4
- లాండ్రీ సూపర్‌వైజర్- 1
- CSSD అటెండెంట్- 1
- వార్డ్ అటెండెంట్- 2
- వర్కర్స్- 2
- గ్యాస్ మెయిన్‌ఫోల్డ్ టెక్నీషియన్- 4
BDL Recruitment 2021: హైదరాబాద్, విశాఖపట్నంలో ఖాళీలు
BECIL Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
- దరఖాస్తు ప్రారంభం- 2021 మార్చి 13
- దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మార్చి 29
- విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, డిప్లొమా పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో ఉంటాయి.
- దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ, మహిళా అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.450.
- ఎంపిక విధానం- రాతపరీక్ష, ఇంటర్వ్యూ
- వేతనం- పోస్టును బట్టి రూ.15,492 నుంచి రూ.37,500 వరకు లభిస్తుంది.
NTA DU Recruitment 2021@1145 Vacancies
BECIL Recruitment 2021: అప్లై చేయండి ఇలా
- అభ్యర్థులు ముందుగా https://becilregistration.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
- అందులో New Registration పైన క్లిక్ చేయాలి.
- పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ లాంటి బేసిక్ డీటైల్స్ ఎంటర్ చేయాలి.
- ఆ తర్వాత విద్యార్హతలు, వర్క్ ఎక్స్‌పీరియెన్స్ వివరాలు ఎంటర్ చేయాలి.
- ఫోటో, సంతకం, సర్కిఫికెట్స్ అప్‌లోడ్ చేయాలి.
- చివరగా ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
- దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసి భద్రపర్చుకోవాలి.
No comments:
Post a Comment