NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Mar 13, 2021

BDL Recruitment 2021

  SSK       Mar 13, 2021

BDL Recruitment 2021 | భారత్ డైనమిక్స్ లిమిటెడ్-BDL హైదరాబాద్, విశాఖపట్నం, సంగారెడ్డిలో ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర రక్షణ శాఖకు చెందిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్-BDL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 70 ఖాళీలున్నాయి. హైదరాబాద్, సంగారెడ్డి, విశాఖపట్నంలో ఈ పోస్టులు ఉన్నాయి. ఇవి ఏడాది గడువు ఉన్న పోస్టులు మాత్రమే. ప్రాజెక్ట్ అవసరాలను బట్టి గడువును నాలుగేళ్లకు పొడిగిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 మార్చి 31 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://bdl-india.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే అభ్యర్థులు hrcorp-careers@bdl-india.in మెయిల్ ఐడీలో సంప్రదించొచ్చు.

BDL Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే

మొత్తం ఖాళీలు- 70

  • ప్రాజెక్ట్ ఇంజనీర్- 55
  • ప్రాజెక్ట్ ఇంజనీర్ (మెకానికల్)- 24
  • ప్రాజెక్ట్ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్)- 22
  • ప్రాజెక్ట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)- 1
  • ప్రాజెక్ట్ ఇంజనీర్ (కంప్యూటర్స్)- 1
  • ప్రాజెక్ట్ ఇంజనీర్ (సివిల్)- 3
  • ప్రాజెక్ట్ ఇంజనీర్ (SAP ERP / Network)- 4
  • ప్రాజెక్ట్ ఆఫీసర్- 15
  • ప్రాజెక్ట్ ఆఫీసర్ (హెచ్ఆర్)- 7
  • ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఫైనాన్స్)- 4
  • ప్రాజెక్ట్ ఆఫీసర్ (BD)- 4

NTA Recruitment 2021 @1145 Vacancies 

BDL Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

  • దరఖాస్తు ప్రారంభం- 2021 మార్చి 12
  • దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మార్చి 31 సాయంత్రం 4 గంటలు
  • విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. సంబంధిత సబ్జెక్ట్‌లో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, సీఏ, ఐసీడబ్ల్యూఏ, బీఎస్సీ, ఎంబీఏ, పీజీ డిప్లొమా, ఎంఎస్‌డబ్ల్యూ పాస్ అయినవారు అప్లై చేయొచ్చు. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో ఉన్నాయి.
  • వయస్సు- 2021 మార్చి 5 నాటికి 28 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
  • వేతనం- మొదటి ఏడాది రూ.30,000, రెండో ఏడాది రూ.33,000, మూడో ఏడాది రూ.36,000, నాలుగో ఏడాది రూ.39,000 లభిస్తుంది.
  • ఎంపిక విధానం- మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపిక చేసి ఆ తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

BDL Recruitment 2021: దరఖాస్తు చేయండి ఇలా

  • అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు ముందుగా https://bdl-india.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  • ఆ తర్వాత Career సెక్షన్ పైన క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత RECRUITMENTS క్లిక్ చేస్తే నోటిఫికేషన్ కనిపిస్తుంది.
  • అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అన్ని వివరాలతో దరఖాస్తు చేయాలి.
  • ఫోటో, సంతకం, అవసరమైన Documents సబ్మిట్ చేయాలి.
  • చివరగా ఫీజు చెల్లించి దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి.
  • దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత డౌన్‌లోడ్ చేసుకొని భద్రపర్చుకోవాలి.

logoblog

Thanks for reading BDL Recruitment 2021

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...