NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Mar 27, 2021

APSSDC Jobs

  SSK       Mar 27, 2021

APSSDC Jobs: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్స్ డవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి తాజాగా మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్స్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏపీలోని వేలాది మందికి శిక్షణ అందించి ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పిస్తున్న విషయం తెలిసిందే. సంస్థ నుంచి నిత్యం నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. తాజాగా సంస్థ నుంచి మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ISUZU Motors India Pvt. Ltd లో ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. దాదాపు 100 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్వ్యూలను ఈ నెల 31న ప్రకాశం జిల్లాలో నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ రోజు ఉదయం 9 గంటలకు నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.

 Realme Days Sale: ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ డేస్ సేల్ ప్రారంభం

ఖాళీలు, అర్హతల వివరాలు:

ట్రైనీ విభాగంలో ఈ నోటిఫికేషన్ ద్వారా 100 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఐటీఐ, డిప్లొమో, బీఎస్సీ, బీకాం, బీఏ, బీటెక్, బీఈ విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. 2018, 19, 20లో పాసైన వారికి మాత్రమే ఇంటర్వ్యూలకు ప్రవేశం ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 18-20 ఏళ్లు ఉండాలి. ఐటీఐ చేసిన వారికి నెలకు రూ. 8,950, ఇతర అర్హతలు కలిగిన వారికి నెలకు రూ. 10 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.

Amazon Smartphone Upgrade Days sale

ఇంటర్వ్యూ వివరాలు:

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 31న ఉదయం 9 గంటలకు DR.SAMUEL GEORGE INSTITUTE OF PHARMACEUTICAL SCIENCE, MARKAPUR, PRAKASHAM చిరునామాలో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు మొదటగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏమైనా సందేహాలుంటే 9963005209 నంబరును సంప్రదించాలని సూచించారు. బ్యాక్ లాగ్ లు ఉన్న, ఏపీ కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు అనర్హులని ప్రకటనలో స్పష్టం చేశారు.

ఇతర వివరాలు:

టెక్నికల్ రౌండ్, హెచ్ఆర్ రౌండ్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు ISUZU-3500, CENTRAL EXPY, SRICITY, ANDHRA PRADESH చిరునామాలో పని చేయాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు సబ్సీడీపై క్యాంటీన్, రవాణా సదుపాయం ఉంటుంది. ఫ్రీ యూనిఫామ్, ఫ్రీ మెడికల్ ఇన్సూరెన్స్ సదుపాయం ఉంటుంది.

logoblog

Thanks for reading APSSDC Jobs

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...