ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. అనంతపురం జిల్లాలోని కియా కంపెనీలో ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్ జిల్లాలో ప్రముఖ కియా మోటార్ పరిశ్రమ ఏర్పాటైన విషయం తెలిసిందే. ఈ ప్రసిద్ధి చెందిన కార్ల తయారీ పరిశ్రమ తాజాగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) ద్వారా 200 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందు కోసం కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరులోని Gudlavalleru Engineering Collegeలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు APSSDC తెలిపింది.
Educational Details:
ఈ ఇంటర్వ్యూల ద్వారా మొత్తం 200 ఖాళీలను భర్తీ చేయనున్నారు. NEEM Trainee విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఏదైనా విభాగంలో డిప్లొమో చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు. ఫ్రెషర్స్ తో పాటు అనుభవం ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. అభ్యర్థులకు 18-25 ఏళ్ల వయస్సు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.14 వేల నుంచి రూ.15 వేల వరకు వేతనం చెల్లించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులని ప్రకటనలో స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్థులు అనంతపురం జిల్లాలోని పెనుగొండలోని కియా కంపెనీ ప్రాంగణంలో పని చేయాల్సి ఉంటుంది.
Interviews:
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 16న ఉదయం 9 గంటలకు Gudlavalleru Engineering Collegeలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులకు ఆన్లైన్ పరీక్ష నిర్వహించి ఎంపిక చేయనున్నారు. ఇతర వివరాలకు 8074370846, 9848819682, 7981938644 నంబర్లను సంప్రదించవచ్చు.
Also Read: SVNIT Non-Teaching Recruitment 2021
No comments:
Post a Comment