NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Mar 18, 2021

AP TET new Guidelines 2021

  NewNotifications       Mar 18, 2021

Orders issued with TET guidelines - no longer once a year - AP TET in July this year

టెట్ మార్గదర్శకాలతో ఉత్తర్వులు విడుదల - ఇకపై ఏడాదికి ఒక్కసారే - ఈ ఏడాది జూలైలో ఏపీ టెట్

ఇకపై కంప్యూటర్ ఆధారిత పరీక్ష

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను ఇకపై ఏడాదికి ఒక్కసారే నిర్వహించనున్నారు. ఇప్పటివరకు రెండు పర్యాయాలు నిర్వహించాలని ఉన్న నిబంధనను సవరించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రాజశేఖర్ బుధవారం టెట్ మార్గదర్శకాలను విడుదల చేశారు. ఇకపై కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు. ఈసారి కొత్తగా ప్రత్యేక విద్య ఉపాధ్యాయులకు సైతం టెట్ ఉంటుంది. వ్యాయామ ఉపాధ్యాయులకు మినహాయింపునిచ్చారు. ఎస్‌జి‌టిల (ప్రాథమిక విద్య 1-5 తరగతులు) కు పేపర్-1, స్కూల్ అసిస్టెంట్ల (6-8 తరగతులు) కు పేపర్-2 ఉంటుంది. ప్రత్యేక విద్య ఉపాధ్యాయులకు ప్రాథమిక, ఉన్నత విద్యలకు విడివిడిగా పరీక్ష నిర్వహిస్తారు. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఆదేశాలకు అనుగుణంగా 2010కి ముందు డీఈడీ పూర్తి చేసిన వారికి ఇంటర్‌లో 45% మార్కులున్నా పరీక్షకు అనుమతిస్తారు. ఆ తర్వాత సంవత్సరాల వారికి 50% మార్కులు తప్పనిసరి. 2011 జులై 29కి ముందు బీఈడీలో ప్రవేశాలు పొందిన వారికి డిగ్రీలో ఎలాంటి అర్హత మార్కులు అవసరం లేదు.

డీఈడీ, బీఈడీ చివరి ఏడాది చదివేవారు టెట్ కు అర్హులే.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు 2010కి ముందు డీఈడీలో ఉత్తీరులై ఉంటే ఇంటర్ లో 40 %, ఆ తర్వాత వారికి 45% మార్కులు ఉండాలి.

అన్ని ప్రశ్నలు బహుళైచ్ఛిక విధానంలో ఉంటాయి. 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. నెగెటివ్ మార్కులు ఉండవు. పేపర్-1లో గణితం 30, పర్యావరణ విద్య 30, భాష-18 30, ఆంగ్లం-30, విద్యార్థి ప్రగతిపెడగాజీకి 30 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం రెండున్నర గంటలు ఉంటుంది.

బీఈడీ వారికి ఎన్జీటీ పోస్టులకు అర్హత కల్పించినందున వీరు టెట్ రెండు పేపర్లకు అర్హులు.

స్కూల్ అసిస్టెంట్ల పరీక్షలో ఆయా సబ్జెక్టులకు 60 మార్కులు ఉంటాయి. వీరికి పర్యావరణ విద్య సబ్జెక్టు ఉండదు. ఆంగ్ల భాష పరీక్ష అభ్యర్థులందరికీ ఉంటుంది. ఇంటర్ స్థాయిలో ప్రశ్నలు ఇస్తారు.

అర్హత మార్కులు

జనరల్ అభ్యర్థులకు 60 %, బీసీలకు 50%, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు 40% పైన మార్కులను అర్హతగా నిర్ణయించారు. టెట్ కాలపరిమితి ఏడేళ్లు వరకు ఉంటుంది. ఉపాధ్యాయ నియామకాల్లో దీనికి 20% వెయిటేజీ ఇస్తారు. ఎన్‌సీటీఈ మార్గదర్శకాల ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు సైతం టెట్ అర్హత సాధించాల్సి ఉంటుంది.

ఏప్రిల్ లో ప్రకటన

టెట్ ను జులైలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ లేకుంటే వచ్చే నెలలోనే నోటిఫికేషన్ జారీ చేసి, దరఖాస్తులు స్వీకరిస్తారు. పాఠ్య ప్రణాళిక మారనుంది. రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి కొత్త పాఠ్య ప్రణాళికను రూపొందిస్తోంది.

logoblog

Thanks for reading AP TET new Guidelines 2021

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...