UPSC Recruitment 2021 | యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC పలు ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 89 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. దరఖాస్తు చేయడానికి 2021 మార్చి 18 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్ మరిన్ని వివరాలను యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://www.upsc.gov.in/ లో తెలుసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు https://upsconline.nic.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి.
UPSC Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...
మొత్తం ఖాళీలు- 89
- పబ్లిక్ ప్రాసిక్యూటర్- 43
- అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్- 26
- అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ (సివిల్)- 10
- ఎకనమిక్ ఆఫీసర్- 1
- సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (బాలిస్టిక్స్)- 1
- ప్రోగ్రామర్ గ్రేడ్ ఏ- 1
- సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (బయాలజీ)- 2
- సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (కెమిస్ట్రీ)- 2
- సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (డాక్యుమెంట్స్)- 2
- సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (లై డిటెక్షన్)- 1
UPSC Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
- దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మార్చి 18
- దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ- 2021 మార్చి 19
- విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
- వయస్సు- గరిష్టంగా 35 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీస్ అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది.
- వేతనం- ఎంపికైన వారికి కేంద్ర ప్రభుత్వ 7వ వేతన స్కేల్ వర్తిస్తుంది.
- దరఖాస్తు ఫీజు- రూ.25. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.
UPSC Recruitment 2021: అప్లై చేయండి ఇలా
- ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి విద్యార్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.
- విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు https://upsconline.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజీలో ONLINE RECRUITMENT APPLICATION (ORA) FOR VARIOUS RECRUITMENT POSTS పైన క్లిక్ చేయాలి.
- అందులో వేర్వేరు పోస్టులకు వేర్వేరు లింక్స్ ఉంటాయి.
- దరఖాస్తు చేయాలనుకున్న పోస్టుకు సంబంధించిన Apply Now లింక్ క్లిక్ చేయాలి.
- ఫీజు చెల్లించి దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
No comments:
Post a Comment