Supreme Court of India Recruitment 2021
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి
నిరుద్యోగులకు సుప్రీంకోర్టు శుభవార్త చెప్పింది. ట్రాన్స్ లేటర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
నిరుద్యోగులకు సుప్రీంకోర్టు శుభవార్త చెప్పింది. 30 ట్రాన్స్ లేటర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. వివిధ స్థానిక భాషలకు సంబంధించి ఈ ట్రాన్స్ లేటర్ ఉద్యోగాల భర్తీని చేపట్టినట్లు సుప్రీంకోర్టు నోటిఫికేషన్లో పేర్కొంది.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 13లోగా అప్లై చేయాలని నోటిఫికేషన్లో సూచించారు. ఎంపికైన అభ్యర్థులు కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ను ఇంగ్లిష్ నుంచి వివిధ ప్రాంతీయ భాషల్లోకి ట్రాన్స్ లేట్ చేయాల్సి ఉంటుంది.
హిందీ ట్రాన్స్ లేషన్ కు సంబంధించి 5, అస్సామీ 2, బెంగాలీ 2, తెలుగు 2, గుజరాతీ 2, ఉర్దు 2, మరాఠీ 2, తమిళం 2, కన్నడ 2, మళయాళం 2, మణిపురి 2, ఒడిషా 2, పంజాబీ 2, నేపాలీ 1 పోస్టు ఉన్నాయి.
అర్హతల వివరాలు.. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు ట్రాన్స్ లేషన్ లో సర్టిఫికేట్/డిప్లొమో కోర్సు చేసి ఉండాలి.
అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
ఎలా అప్లై చేయాలంటే.. అభ్యర్థులు మొదట అధికారిక వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి. అనంతరం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
ఇంతకు ముందే రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఆ వివరాలతో లాగిన్ అవ్వొచ్చు. కావాల్సిన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలి.
అనంతరం అప్లికేషన్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ అభ్యర్థులకు రూ. 500, ఎస్సీ, ఎస్టీ/PH అభ్యర్థులు రూ. 250 పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ డైరెక్ట్ లింక్: https://jobapply.in/Sc2020Translator/Adv-Eng.pdf
No comments:
Post a Comment