RRB NTPC 2021: ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ నాలుగో దశ పరీక్ష తేదీలు వెల్లడి.. వివరాలివే
Indian Railways: ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షలకు సంబంధించి హాల్‌టికెట్లను పరీక్షలకు నాలుగు రోజుల ముందు నుంచి అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ప్రధానాంశాలు:
- ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ నాలుగో దశ షెడ్యూల్ విడుదల
- ఫిబ్రవరి 15 నుంచి మార్చి 3 వరకు పరీక్షలు
- సుమారు 15 లక్షల మంది హాజరుకానున్నట్లు అంచనా
ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ నాలుగో దశ పరీక్షల షెడ్యూల్‌ను రైల్వేరిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. ఈ పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమై.. మార్చి 3న ముగుస్తాయని తెలిపింది. ఈ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత విధానంలో జరుగుతాయి. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 15 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
ఇక వీటికి సంబంధించి హాల్‌టికెట్లను పరీక్షలకు నాలుగు రోజుల ముందు నుంచి ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ పరీక్షలు దశలవారీగా జరుగుతున్నాయి. మొదటి రెండు దశలు ఇప్పటికే పూర్తికాగా, ప్రస్తుతం మూడో దశ పరీక్షలు జరుగుతున్నాయి. జనవరి 31న ప్రారంభమైన ఈ పరీక్షలు ఈనెల 12న ముగియనున్నాయి. ఈ పరీక్షలకు సుమారు 28 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.
35,208 నాన్‌టెక్నికల్ పాపులర్ కేటగిరీ (ఎన్టీపీసీ) పోస్టులతో 2019లో ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలసిందే. ఈ పోస్టులకు 1,26,30,885 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు వెబ్‌సైట్ http://www.rrbcdg.gov.in/ చూడొచ్చు.
Must Read: Indian Railways Recruitment 2021 for 2532 Posts
No comments:
Post a Comment