RBI Recruitment 2021 | ఆర్‌బీఐలో ఉద్యోగాలు కోరుకునేవారికి గుడ్ న్యూస్. మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. నాన్ సీఎస్‌జీ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 53 ఖాళీలున్నాయి. అసిస్టెంట్ మేనేజర్, లీగల్ ఆఫీసర్, మేనేజర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయాల్సి ఉంది. దరఖాస్తు ప్రక్రియ 2021 ఫిబ్రవరి 23న ప్రారంభం కానుంది. అప్లై చేయడానికి 2021 మార్చి 10 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://opportunities.rbi.org.in/ లేదా https://www.rbi.org.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఫిబ్రవరి 23న విడుదల కానుంది. నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకొని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.
RBI Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...
మొత్తం ఖాళీలు- 53
- అసిస్టెంట్ మేనేజర్ (అఫీషియల్ లాంగ్వేజ్)- 12
- లీగల్ ఆఫీసర్ (గ్రేడ్ బీ)- 11
- మేనేజర్ (టెక్నికల్ సివిల్)- 1
- అసిస్టెంట్ మేనేజర్ (ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ)- 5
RBI Recruitment 2021: విద్యార్హతల వివరాలు ఇవే...
- అసిస్టెంట్ మేనేజర్ (అఫీషియల్ లాంగ్వేజ్)- హిందీ సబ్జెక్ట్‌లో మాస్టర్స్ డిగ్రీ. రెండేళ్ల అనుభవం.
- లీగల్ ఆఫీసర్ (గ్రేడ్ బీ)- న్యాయ శాస్త్రంలో గ్రాడ్యుయేషన్. రెండేళ్ల అనుభవం.
- మేనేజర్ (టెక్నికల్ సివిల్)- సివిల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్. మూడేళ్ల అనుభవం.
- అసిస్టెంట్ మేనేజర్ (ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ)- ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఆఫీసర్ ర్యాంక్‌లో 5 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.
RBI Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
- దరఖాస్తు ప్రారంభం- 2021 ఫిబ్రవరి 23
- దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మార్చి 10
- రాతపరీక్ష- 2021 ఏప్రిల్ 10
- విద్యార్హతలు- పోస్ట్ గ్రాడ్యుయేషన్
- వేతనం- రూ.77,208 వరకు
- ఎంపిక విధానం- రాతపరీక్ష, ఇంటర్వ్యూ
RBI Recruitment 2021: దరఖాస్తు చేయండి ఇలా
- అభ్యర్థులు ముందుగా https://www.rbi.org.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
- ఆ తర్వాత హోమ్ పేజీలో కింది వైపు Opportunities@RBI పైన క్లిక్ చేయాలి.
- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Current Vacancies పైన క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత Vacancies పైన క్లిక్ చేయాలి.
- non CSG రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేయాలి.
- ఓసారి నియమనిబంధనలన్నీ పూర్తిగా చదవాలి.
- ONLINE application పైన క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- అందులో NEW REGISTRATION పైన క్లిక్ చేయాలి.
- పేరు, పుట్టిన తేదీ, కాంటాక్ట్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, అడ్రస్ లాంటి వివరాలు ఎంటర్ చేసి save and next బటన్ పైన క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత స్టెప్‌లో ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
- ఫోటో, సంతకం అప్‌లోడ్ చేసిన తర్వాత విద్యార్హతలు, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వివరాలు ఎంటర్ చేసి save and next బటన్ పైన క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత అప్లికేషన్ ప్రివ్యూ చూసుకోవాలి. తప్పులు ఏవైనా ఉంటే సరిచేయాలి.
- ఆ తర్వాత save and next పైన క్లిక్ చేయాలి.
- దరఖాస్తు ఫీజు చెల్లించిన Final Submit బటన్ పైన క్లిక్ చేయాలి.
- మీ అప్లికేషన్ ఫామ్ విజయవంతంగా సబ్మిట్ అవుతుంది.
- అప్లికేషన్ వివరాలు ఎస్ఎంఎస్, ఇమెయిల్‌లో వస్తాయి.
- దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భవిష్యత్తులో రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోవాలి.
No comments:
Post a Comment