Railway Teacher Jobs 2021
1. భారతీయ రైల్వేలో క్లర్క్, టికెట్ కలెక్టర్, లోకో పైలట్ లాంటి పోస్టులతో పాటు రైల్వేకు చెందిన విద్యా సంస్థల్లో టీచర్ పోస్టులు కూడా ఉంటాయి. భారతీయ రైల్వేకు చెందిన రైల్వే జోన్స్ ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తుంటాయి.
2. వెస్ట్ సెంట్రల్ రైల్వే ప్రైమరీ టీచర్-PRT, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్-TGT, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్-PGT లాంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 2021-22 విద్యాసంవత్సరం కోసం ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇవి తాత్కాలిక పోస్టులు మాత్రమే. మొత్తం 13 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 ఫిబ్రవరి 15 చివరి తేదీ.
3. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://wcr.indianrailways.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాతే దరఖాస్తు చేయాలి. దరఖాస్తుల్ని నోటిఫికేషన్‌లో వెల్లడించిన ఇమెయిల్ అడ్రస్‌కు చివరి తేదీలోగా మెయిల్ పంపాలి.
4. మొత్తం 13 ఖాళీలు ఉండగా అందులో ప్రైమరీ టీచర్ (PRT)- 4, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT)- 3 (ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT)- 6 (హిందీ, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, హిస్టరీ, సోషియాలజీ) పోస్టులున్నాయి.
5. విద్యార్హతల వివరాలు చూస్తే ప్రైమరీ టీచర్-PRT పోస్టుకు 50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ, రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పాస్ కావాలి. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్-TGT పోస్టుకు గ్రాడ్యుయేషన్‌తో పాటు బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్- B.Ed పాస్ కావాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్-PGT పోస్టుకు రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు పాస్ కావాలి.
6. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ప్రైమరీ టీచర్-PRT పోస్టుకు రూ.21,250, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్-TGT పోస్టుకు రూ.26,250, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్-PGT పోస్టుకు రూ.27,500 వేతనం లభిస్తుంది.
No comments:
Post a Comment