NEST 2021 Notification Released 2021
నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (నెస్ట్-2021) నోటిఫికేషన్ విడుదల
భారత ప్రభుత్వ అణు శక్తి విభాగానికి చెందిన భువనేశ్వర్‌లోని నైసర్, ముంబయిలోని యూఎం-డీఏఈ సీఈబీఎస్ సంయుక్తంగా 2021 సంవత్సరానికి నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (నెస్ట్-2021) నోటిఫికేషన్ విడుదల చేశాయి. దీని ద్వారా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీలో ప్రవేశాలు కల్పిస్తారు.
అర్హత: సైన్స్ విభాగాల్లో కనీసం 60%/ తత్సమాన సీజీపీఏతో 2019/ 2020లో ఇంటర్మీడియట్ పూర్తి చేసినవారు, 2021లో ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్నవారు అర్హలు.
వయసు: జనరల్, ఓబీసీ విద్యార్థులు ఆగస్టు 01, 2001 తర్వాత జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్. దరఖాస్తు ఫీజు: రూ.1200.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఫిబ్రవరి 24, 2021.
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 30, 2021.
నెస్ట్ 2021 పరీక్ష తేది: జూన్ 14, 2021.
No comments:
Post a Comment