NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Feb 19, 2021

MGNF 2021: నెలకు రూ.60,000 ఫెలోషిప్‌.. ఏదైనా గ్రాడ్యుయేషన్‌ పాసైన వారు అప్లయ్‌ చేసుకోండ

  SSK       Feb 19, 2021

MGNF 2021: నెలకు రూ.60,000 ఫెలోషిప్‌.. ఏదైనా గ్రాడ్యుయేషన్‌ పాసైన వారు అప్లయ్‌ చేసుకోండి

MGNF 2021: ఐఐఎం-బెంగళూరు 2021-2023 విద్యాసంవత్స‌రానికి గాను మ‌హాత్మా గాంధీ నేష‌న‌ల్ ఫెలోషిప్‌ (ఎంజీఎన్ఎఫ్) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఐఐఎం బెంగ‌ళూరు మాత్రం ఉమ్మ‌డి ప్ర‌వేశ ప్ర‌క్రియ‌ నిర్వ‌హిస్తోంది.

ప్రధానాంశాలు:

  • ఎంజీఎన్ఎఫ్ 2021 నోటిఫికేషన్‌ విడుదల
  • ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులైన వాళ్లు అర్హులు
  • ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు
  • దరఖాస్తుకు మార్చి 27 చివరితేది

మ‌హాత్మా గాంధీ నేష‌న‌ల్ ఫెలోషిప్‌(ఎంజీఎన్ఎఫ్) 2021-2023 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఐఐఎం-బెంగళూరు, భార‌త ప్ర‌భుత్వ స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ మంత్రిత్వ‌శాఖ‌తో క‌లిసి 2021-2023 విద్యాసంవత్స‌రానికి మ‌హాత్మా గాంధీ నేష‌న‌ల్ ఫెలోషిప్‌(ఎంజీఎన్ఎఫ్) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. దీనికి దేశ‌వ్యాప్తంగా తొమ్మిది ఐఐఎంలు సపోర్ట్‌ చేస్తున్నాయి. ఐఐఎం బెంగ‌ళూరు మాత్రం ఉమ్మ‌డి ప్ర‌వేశ ప్ర‌క్రియ‌ నిర్వ‌హిస్తోంది.

మ‌హాత్మా గాంధీ నేష‌న‌ల్ ఫెలోషిప్‌(ఎంజీఎన్ఎఫ్) 2021-2023

  • అర్హ‌త‌: గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌. 0-3 ఏళ్ల ప‌ని అనుభ‌వం ఉన్నవారికి ప్రధాన్యత‌‌‌నిస్తారు. అలాగే సంబంధిత లోక‌ల్ లాంగ్వేజ్‌లో ప్రొఫిషియ‌న్సీ ఉండాలి.
  • వ‌య‌సు: 21-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
  • ఎంపిక విధానం: ప్ర‌వేశ ప‌రీక్ష, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.
  • ప‌రీక్షా విధానం: మ‌ల్టిపుల్ ఛాయిస్ ప్ర‌శ్న‌ల రూపంలో ఈ ప‌రీక్ష ఉంటుంది. దీన్ని 100 మార్కుల‌కు నిర్వ‌హిస్తారు. ఇందులో జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, డేటా ఇంట‌ర్‌ప్రిటేష‌న్ అండ్ లాజిక‌ల్ రీజ‌నింగ్‌, వ‌ర్బ‌ల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్ర‌హెన్ష‌న్ విభాగాల నుంచి ప్ర‌శ్న‌లు ఉంటాయి.
  • స్టైపెండ్‌: 2021-2023 ఎంజీఎన్ఎఫ్ ప్రోగ్రాంకు ఎంపికై అభ్య‌ర్థుల‌కు స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూవర్‌షిప్‌ మంత్రిత్వ‌శాఖ మొద‌టి ఏడాది నెల‌కు రూ.50000, రెండో ఏడాది నెల‌కు రూ.60000 స్టైపెండ్‌ను అందిస్తోంది.

ముఖ్య‌ సమాచారం:

  • ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
  • ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: మార్చి 27, 2021.
  • ప్ర‌వేశ ప‌రీక్ష‌కు అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ తేదీ: మార్చి 27, 2021.
  • ప‌రీక్ష తేది: 2021 ఏప్రిల్ మూడో వారంలో నిర్వహించనున్నారు. పరీక్ష తేదీని త్వరలో వెల్లడిస్తారు.
  • ఫ‌లితాల వెల్ల‌డి తేది: 2021 ఏప్రిల్ చివ‌రి వారంలో ఉంటుంది.
  • ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ తేది: 2021 మే 2 నుంచి 4 వారం వరకు జరుగుతాయి.

పూర్తి నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

logoblog

Thanks for reading MGNF 2021: నెలకు రూ.60,000 ఫెలోషిప్‌.. ఏదైనా గ్రాడ్యుయేషన్‌ పాసైన వారు అప్లయ్‌ చేసుకోండ

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...