Indian Navy Jobs 2021
OFFICER ENTRY - PERMANENT COMMISSION 10+2 (B.TECH) CADET ENTRY SCHEME - JUL 2021 IS ONLINE FROM 29 JAN 2021 TO 09 FEB 2021
Event Start Date:29/01/2021
Event End Date:09/02/2021
Applications are invited from UNMARRIED MALE CANDIDATES (fulfilling the conditions of nationality as laid down by the Govt. of India) to join the prestigious Indian Naval Academy, Ezhimala, Kerala for a four year degree course under the 10+2 (B.Tech) Cadet Entry Scheme.
1. ఇంటర్మీడియట్ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేసేందుకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది ఇండియన్ నేవీ. ఎంపికైనవారికి 2021 జూలైలో కోర్సు మొదలవుతుంది. మొత్తం 26 ఖాళీలున్నాయి.
2. ఈ పోస్టులకు అప్లై చేయడానికి 2021 ఫిబ్రవరి 9 చివరి తేదీ. అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు, ఇతర అర్హతలు తెలుసుకోవాలి. https://www.joinindiannavy.gov.in/ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ ఉంటుంది.
3. అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. మరి ఇంటర్ పాసైనవారు ఇండియన్ నేవీలో 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌కు ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.
4. అభ్యర్థులు ముందుగా https://www.joinindiannavy.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో Current Events పైన క్లిక్ చేయాలి. అందులో OFFICER ENTRY - PERMANENT COMMISSION 10+2 (B.Tech) CADET ENTRY SCHEME - JUL 2021 పైన క్లిక్ చేయాలి.
5. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్‌తో పాటు దరఖాస్తు లింక్ ఉంటుంది. Click Here to apply online పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత అభ్యర్థి వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
6. అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. 10వ తరగతి, 12వ తరగతి సర్టిఫికెట్లు, జేఈఈ మెయిన్ 2020 స్కోర్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజ్ కలర్ ఫోటో అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
7. విద్యార్హతల వివరాలు చూస్తే 10+2 లేదా తత్సమాన పరీక్ష పాసైనవారు దరఖాస్తు చేయొచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లో కనీసం 70% మార్కులు ఉండాలి. ఇంగ్లీష్‌లో 50% మార్కులుండాలి. జేఈఈ మెయిన్ 2020 ఎగ్జామ్ పాస్ కావాలి. పెళ్లికాని యువకులు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేయాలి.
8. జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంక్ ఆధారంగా ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూ రెండు దశల్లో ఉంటుంది. స్టేజ్ 1 లో ఇంటెలిజెన్స్ టెస్ట్, పిక్చర్ పర్సెప్షన్, గ్రూప్ డిస్కషన్ ఉంటాయి. స్టేజ్ 1 క్వాలిఫై అయినవారికి సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టెస్టింగ్, ఇంటర్వ్యూ ఉంటాయి. రెండు దశల ఇంటర్వ్యూ విజయవంతంగా పూర్తి చేసిన వారికి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.
No comments:
Post a Comment