GKCIET teaching and non teaching recruitment
జీకేసీఐఈటీలో 48 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు.. చివరి తేది మార్చి 10
భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన పశ్చిమ బెంగాల్‌లోని ఘనీ ఖాన్ చౌధురీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (జీకేసీఐఈటీ).. టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobsవివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 48
పోస్టుల వివరాలు: ఫ్యాక్టల్టీ అండ్ టెక్నికల్ స్టాఫ్: 42; నాన్ టీచింగ్ అడ్మినిస్ట్రేటివ్: 06.
విభాగాలు: సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఏఈ/ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్, ఇంగ్లిష్, సోషియాలజీ, నాన్ ఫార్మల్.
నాన్ టీచింగ్ అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు(డిప్యూటీ రిజిస్ట్రార్-01, అసిస్టెంట్ రిజిస్టార్-02, సీనియర్ అసిస్టెంట్/ క్యాషియర్-01, జూనియర్ అసిస్టెంట్-02)
అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా ఇంజనీరింగ్, బీఈ/బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, ఎంఈ/ఎంటెక్, పీహెచ్‌డీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత టీచింగ్ అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: మార్చి 10, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.gkciet.ac.in
No comments:
Post a Comment