ECIL Recruitment 2021 @650 Technical officer jobs
రాత పరీక్ష లేకుండా ECIL లో 650 జాబ్స్.. మార్కుల మెరిట్ ద్వారా ఎంపిక.. దరఖాస్తుకు 2 రోజులే గడువు
- ఈసీఐఎల్ 650 టెక్నికల్ ఆఫీసర్ జాబ్ నోటిఫికేషన్
- బీఈ/బీటెక్ వాళ్లు అర్హులు
- అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక
- ఫిబ్రవరి 15 దరఖాస్తులకు చివరితేది
భారత ప్రభుత్వ అణు శక్తి విభాగానికి చెందిన హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) 650 టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సీలింగ్, డిస్ట్రిబ్యూషన్, పోలింగ్, ఈవీఎం, వీవీపాట్ కమిషనింగ్ పనుల్లో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాజెక్టు సైట్‌లలో పనిచేయడానికి 6 నెలల ఒప్పంద ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తోంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు http://www.ecil.co.in/ వెబ్‌సైట్ చూడొచ్చు
ముఖ్య సమాచారం:
మొత్తం ఖాళీలు: 650
అర్హత: కనీసం 60% మార్కులతో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇనుస్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్/ మెకానికల్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో ఏడాది పోస్టు క్వాలిఫికేషన్ ఇండస్ట్రియల్ అనుభవం ఉండాలి.
వయసు: 31.01.2021 నాటికి 30 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్(బీఈ/ బీటెక్ మార్కులు), అనుభవం ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఫిబ్రవరి 06, 2021.
దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 15, 2021.
వెబ్‌సైట్:http://www.ecil.co.in/
Also Read: 1,374 vacant posts in CBI: Government
No comments:
Post a Comment