BHEL Recruitment 2021: బీహెచ్ఈఎల్‌లో 300 ఉద్యోగాలు ఖాళీల వివరాలు ఇవే
ఐటీఐ పాస్ అయినవారికి శుభవార్త. ఐటీఐ పాస్ అయినవారు ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్-BHEL లో అప్రెంటీస్ చేసేందుకు అవకాశం లభిస్తోంది. భోపాల్‌లోని బీహెచ్ఈఎల్ యూనిట్‌లో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 300 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్-BHEL. భోపాల్‌లోని బీహెచ్ఈఎల్ యూనిట్‌లో వెల్డర్, టర్నర్, పెయింటర్, కార్పెంటర్ లాంటి పోస్టులున్నాయి. ఇవి అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. ఎంపికైనవారికి ఏడాది అప్రెంటీస్ అవకాశం మాత్రమే లభిస్తుంది. ఐటీఐ తర్వాత ప్రముఖ సంస్థలో అప్రెంటీస్ చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 ఫిబ్రవరి 22 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను భోపాల్‌లోని బీహెచ్ఈఎల్ యూనిట్‌కు చెందిన అధికారిక వెబ్‌సైట్ https://bplcareers.bhel.com/ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. అభ్యర్థులు తప్పనిసరిగా నేషనల్ అప్రెంటీస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్-NAPS పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.
BHEL Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే
మొత్తం ఖాళీలు- 300
- ఎలక్ట్రీషియన్- 80
- ఫిట్టర్- 80
- మెషినిస్ట్- 30
- కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్- 30
- వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్)- 20
- టర్నర్- 20
- డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానిక్)- 5
- ఎలక్ట్రికల్ మెకానిక్- 5
- మెకానిక్ మోటార్ వెహికిల్- 5
- మెషినిస్ట్ (గ్రైండర్)- 5
- మేసన్- 5
- పెయింటర్ (జనరల్)- 5
- కార్పెంటర్- 5
- ప్లంబర్- 5
BHEL Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
దరఖాస్తు ప్రారంభం- 2021 ఫిబ్రవరి 2
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఫిబ్రవరి 22
డాక్యుమెంట్స్ పంపడానికి చివరి తేదీ- 2021 మార్చి 3
విద్యార్హతలు- 10వ తరగతి పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.
వయస్సు- 14 నుంచి 27 ఏళ్లు.
No comments:
Post a Comment