APSSDC Jobs: ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రేపు భారీ జాబ్ మేళా.. పూర్తి వివరాలివే
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) వరుసగా ఉద్యోగాలను భర్తీకి ప్రకటనలు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా విజయవాడ-CRDA పరిధిలో పలు సంస్థల్లో పని చేయడానికి పలు ఉద్యోగాల నియామకాలకు APSSDC నుంచి ప్రకటన విడుదలైంది. ఈ నెల 23న ఉదయం 9 గంటలకు Happy Minds, Rayapati Heights, Kotha Pantakaluva Road, Kanuru, CRDA చిరునామాలో ఇంటర్వ్యూలు నిర్వహించున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన వారు ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు.
ఖాళీలు, అర్హతల వివరాలు
Airtel Payments Bankలో మొత్తం 30 ఖాళీలను ఈ స్కిల్ కనెక్ట్ డ్రైవ్ ద్వారా భర్తీ చేయనున్నారు. ప్రమోటర్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నట్లు ప్రకటనలో పేరకొన్నారు. టెన్త్ ఆ పైన విద్యార్హతలు కలిగిన వారు ఈ పోస్టుల ఇంటర్వ్యూలకు హాజరు కావడానికి అర్హులు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎంపికైన అభ్యర్థఉలు కృష్ణా జిల్లాలో పని చేయాల్సి ఉంటుంది. కేవలం పురుషులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. ఇతర వివరాలను ప్రకటనలో చూడొచ్చు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 10 వేల నుంచి రూ. 14 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. రూ. 6 వేల వరకు ఇన్సెంటీవ్స్ ఉంటాయి.
Phonepe Private Ltdలో 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటీవ్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ. 17 వేల వేతనం చెల్లించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు విజయవాడలో పని చేయాల్సి ఉంటుంది.
Apex Advanced Geo Special Pvt Ltd(AAG)లో 15 ఖాళీలను భర్తీ చేయనున్నారు. క్వాలిటీ కంట్రోలర్, అనలిస్ట్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇంటర్, డిప్లొమో, గ్రాడ్యుయేషన్ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ. 96 వేల నుంచి రూ. 1.44 లక్షల వరకు వేతనం చెల్లించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు విజయవాడలో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి. పురుషులు, స్త్రీలు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు.
Big Basket: వ్యాన్ డెలివరీ ఎగ్జిక్యూటీవ్, బైక్ డెలివరీ ఎగ్జిక్యూటీవ్ విభాగాల్లో ఈ 25 పోస్టులను భర్తీ చేస్తున్నారు. టెన్త్ ఆ పై విద్యార్హతలను కలిగిన వారు ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ. 12, 200 వరకు వేతనం చెల్లించనున్నారు. ఇతర సదుపాయాలు సైతం ఉంటాయి. అభ్యర్థులకు 18 నుంచి 32 ఏళ్ల వయస్సు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు గుంటూరు, విజయవాడలో పని చేయాల్సి ఉంటుంది. కేవలం పురుషులు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేయాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అభ్యర్థులు ఏమైనా సందేహాలుంటే 18004252422, 9603368324, 9030867754 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
Amazon FAB PHONES FEST- UPTO 40% OFF on SmartPhones
No comments:
Post a Comment