AP SSC Time Table 2021: ఈ ఏడాది ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, ఇంగ్లిష్, మేథమెటిక్స్, సోషల్ స్టడీస్ పేపర్లను 100 మార్కులకు, ఫిజికల్ సైన్సు, బయాలజీ పేపర్లను 50 మార్కులకు వేర్వేరుగా నిర్వహించనున్నారు.
ప్రధానాంశాలు:
- ఏపీ ఎస్‌ఎస్‌సీ పరీక్షలపై విద్యాశాఖ కీలక నిర్ణయం
- కొత్త పద్ధతిలో పరీక్షల నిర్వహణ
- ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసిన పాఠశాల విద్యాశాఖ
ఏపీలో పదో తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు అలర్ట్.. ఈ ఏడాది రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను కొత్త పద్ధతిలో నిర్వహించనున్నారు. కరోనా వల్ల విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైన నేపథ్యంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పబ్లిక్ పరీక్షలను 11 పేపర్లకు బదులు 7 పేపర్లకు కుదించిన సంగతి తెలిసిందే.
దీనికి అనుగుణంగా.. ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, ఇంగ్లిష్, మేథమెటిక్స్, సోషల్ స్టడీస్ పేపర్లను 100 మార్కులకు, ఫిజికల్ సైన్సు, బయాలజీ పేపర్లను 50 మార్కులకు వేర్వేరుగా నిర్వహించనున్నారు.
గత విద్యా సంవత్సరం వరకు సమగ్ర నిరంతర మూల్యాంకన విధానంలో ఒక్కోసబ్జెక్ట్‌లో 80 మార్కులకు పబ్లిక్ పరీక్షలను నిర్వహించి, మిగిలిన 20 మార్కులను ఇంటర్నల్ మార్కుల నుంచి తీసుకొని కలిపేవారు. అయితే ఈ ఏడాది (2021 మార్చి) పరీక్షలకు ఈ విధానాన్ని రద్దు చేసి.. పూర్తిగా 100 మార్కులకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆ మేరకు ప్రశ్నపత్రం నమూనాలో స్వల్ప మార్పులు చేస్తూ పాఠశాల విద్యాశాఖ గురువారం జీవో విడుదల చేసింది.
తాజా ఉత్తర్వుల ప్రకారం.. పదో తరగతి ప్రశ్నపత్రాల్లో ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, అతి స్వల్ప సమాధానాల ప్రశ్నలు, స్వల్ప సమాధానాల ప్రశ్నలు, వ్యాసరూప ప్రశ్నలను అడగనున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు రాసేందుకు విద్యార్థులకు 2.30 గంటల సమయం కేటాయిస్తున్నారు. ప్రశ్నపత్రం చదివేందుకు 15 నిమిషాల పాటు అదనపు సమయం ఇస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పరీక్షల నూతన నమూనా:
- (మొత్తం ప్రశ్నలు-33, మార్కులు-100, సమయం-2.30 గంటలు)
- ఆబ్జెక్టివ్ ప్రశ్నలు-12 (మార్కులు-12, సమయం-18 నిమిషాలు)
- అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు- 8 (మార్కులు-16, సమయం-24 నిమిషాలు)
- స్పల్ప సమాధాన ప్రశ్నలు-8 (మార్కులు-32, సమయం-48 నిమిషాలు)
- వ్యాసరూప ప్రశ్నలు-5 (మార్కులు-40, సమయం-60 నిమిషాలు)
అయితే.. ఏపీలో జూన్ 7 నుంచి 16వ తేదీ వరకు పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు విద్యాశాఖ ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదల చేసింది. అలాగే.. మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. జూలై 21వ తేదీ నుంచి ఏపీలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది.
No comments:
Post a Comment