AP SSC Exams: ఏపీ 10 తరగతి పరీక్షల తేదీలు, తగ్గించిన పేపర్లు ఇవే.. పూర్తి వివరాలు
AP 10th Class Exams Schedule: విద్యా సంవత్సరం ఆలస్యంగా ఆరంభమైన నేపథ్యంలో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ పరీక్షలను జూన్ 17 నుంచి నిర్వహించనున్నారు. గతేడాది వరకు ఉన్న 11 పరీక్షలను ఈ ఏడాది 7కే కుదించారు. రెండు ప్రశ్న పత్రాలు ఉండే తెలుగు, ఇంగ్లిష్, మాథ్స్, సోషల్ సబ్జెక్టులకు ఈ సారి ఒకటే పేపర్ ఉండేలా నిర్ణయం తీసుకున్నారు.
కరోనా ఎఫెక్ట్ తో ఈ ఏడాది ఏ పరీక్ష ఎప్పుడు ఉంటుందో? అసలు ఉంటుందో? ఉండదో? అన్న ఆందోళన విద్యార్థులు, తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. అయితే ఈ నేపథ్యంలో ఏపీలో పదో తరగతి పరీక్షల తేదీలపై విద్యాశాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చారు. ఇటీవల విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ నిర్వహించిన సమీక్షలో పరీక్షల తేదీలు. స్కూళ్ల వర్కింగ్ డేస్ తదితర వివరాలతో కూడిన ప్రణాళికను అధికారులు మంత్రికి సమర్పించారు. అధికారులు సమర్పించిన ప్రణాళిక ప్రకారం మే 31 వరకు స్కూళ్లు నిర్వహించనున్నారు. కనీసం 166 పని దినాలు వచ్చేలా సమ్మర్ హాలిడేస్ ను సైతం రద్దు చేశారు. బోర్డ్ ఎగ్జామ్స్ ను జూన్ 7 నుంచి 15 వరకు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఎగ్జామ్ ఫీజును ఫిబ్రవరి 20 నుంచి మార్చి 10లోగా విద్యార్థులు చెల్లించాల్సి ఉంటుంది. ఆయా పరీక్షలకు సంబంధించిన పేపర్ వాల్యుయేషన్ ను జూన్ 17 నుంచి 26 వరకు నిర్వహించనున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే రిజల్ట్స్ ను జులై 5న విడుదల చేయాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చారు.

పరీక్షల షెడ్యూలు: జూన్ 7-ఫస్ట్ లాగ్వేజ్, జూన్ 8-సెకండ్ లాంగ్వేజ్, జూన్ 9-థర్డ్ లాంగ్వేజ్(ఇంగ్లిష్), జూన్ 10-మాథ్స్, జూన్ 11-భౌతిక శాస్త్రం, జూన్ 12-జీవ శాస్త్రం, జూన్ 14-సోషల్. గతేడాది వరకు ఉన్న 11 పరీక్షలను ఈ ఏడాది 7కే కుదించారు. రెండు ప్రశ్న పత్రాలు ఉండే తెలుగు, ఇంగ్లిష్, మాథ్స్, సోషల్ సబ్జెక్టులకు ఈ సారి ఒకటే పేపర్ ఉండేలా నిర్ణయం తీసుకున్నారు.
విద్యా సంవత్సరం ఆలస్యంగా ఆరంభమైన నేపథ్యంలో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ పరీక్షలను జూన్ 17 నుంచి నిర్వహించనున్నారు. గత ఏడాదిలో విద్యాశాఖ పరీక్ష పేపర్లను 11 నుంచి 6కు కుదించింది. కానీ కరోనా తీవ్రత ఉన్నందున పరీక్షలు రద్దు చేసి విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరంలో కూడా తరగతులు ఆలస్యం కావడంతో సిలబస్ కుదించారు. ఈ సారి పేపర్ల సంఖ్య 7కు కుదించారు. గత ఏడాది భాషా పేపర్లతో పాటు సబ్జెక్టు పేపర్లను కలిపి 6కు కుదించారు. ఈ సారి భాషా పేపర్లు, సైన్స్ మినహా ఇతర సబ్జెక్టు పేపర్లను ఒక్కొక్కటి చొప్పున ఐదు ఉంటాయి. సైన్స్ లో మాత్రం భౌతిక శాస్త్రం, వృక్ష శాస్త్రాలకు సంబంధించి వేర్వేరు పేపర్లు ఉంటాయి. మొత్తం 7 పేపర్లలో విద్యార్థుల పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఈ ఏడాది కూడా ఒక్కో పేపర్ ను 100 మార్కులకు నిర్వహించనున్నారు. జూలై మొదటి వారంలో ఫలితాలు విడుదల చేయాలని విద్యాశాఖ భావిస్తోంది.
No comments:
Post a Comment