Andhra Pradesh Jobs: వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల చేస్తున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ తాజాగా నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది.
వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల చేస్తున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ తాజాగా నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. విజయనగరం జిల్లాలో మరుపల్లిలోని OLAM AGRO INDIA LTDలో పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 20 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 4లోగా రిజిస్టర్ చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ నెల 5న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
విద్యార్హతల వివరాలు.
Trainees&Operations విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. IIT(Fitter)/ Diploma Mechanical చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఐటీఐ అభ్యర్థులకు నెలకు రూ. 8 వేలు, డిప్లొమా అభ్యర్థులకు నెలకు రూ. 10 వేలతో పాటు ప్రొడక్షన్ ఇన్సెంటీవ్స్ అందించనున్నారు. కేవలం పురుషులు మాత్రమే అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వయస్సు 18 నుంచి 38 ఏళ్లు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు విజయనగరం జిల్లాలోని కంపెనీలో పని చేయాల్సి ఉంటుంది.
ఎలా అప్లై చేయాలంటే
అభ్యర్థులు పైన ఇచ్చిన లింక్ ద్వారా ఈ నెల 4వ తేదీలోగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఈ నెల 5వ తేదీన ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఆ రోజు ఉదయం 9 గంటల లోగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. టెక్నికల్, HR రౌండ్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఇతర వివరాలకు 9182412990, 9052057825 నంబర్లను సంప్రదించవచ్చు.
No comments:
Post a Comment