AECS-Hyderabad: హైదరాబాద్‌లోని అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్(ఏఈసీఎస్) ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ప్రధానాంశాలు:
- ఏఈసీఎస్-హైదరాబాద్‌లో టీచర్ జాబ్స్
- రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక
- ఫిబ్రవరి 25 దరఖాస్తులకు చివరితేది
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్‌లోని అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్(ఏఈసీఎస్) ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 25 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.nfc.gov.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
పోస్టులు: ప్రిపరేటరీ టీచర్లు, పీఆర్‌టీలు, టీజీటీలు ఉన్నాయి..
విభాగాలు: ఇంగ్లిష్, హిందీ, మాథ్స్, బయోలజీ, కెమిస్ట్రీ, సోషల్ సైన్సెస్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.
అర్హత:
1. టీజీటీ:
- సంబంధిత స్పెషలైజేషన్‌లో గ‌్రాడ్యుయేషన్, బీఈడీ, సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటీఈటీ)లో పేపర్-1 ఉత్తీర్ణత.
- వయసు: 35 ఏళ్లు మించకూడదు.
- జీతభత్యాలు: నెలకు రూ.26250 వరకు చెల్లిస్తారు.
- పరీక్ష తేది: మార్చి 05, 2021.
- వేదిక: Atomic Energy Central School – 1, DAE Colony, ECIL Post, Hyderabad – 500 062.
2. పీఆర్‌టీ:
- కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి, ఇంటర్మీడీయట్, డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్/ బ్యాచిలర్ డిగ్రీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్/ డిప్లొమా ఎడ్యుకేషన్, సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటీఈటీ)లో పేపర్-1 ఉత్తీర్ణత.
- వయసు: 30 ఏళ్లు మించకూడదు.
- జీతభత్యాలు: నెలకు రూ.21250 వరకు చెల్లిస్తారు.
- పరీక్ష తేది: మార్చి 03, 2021.
- వేదిక: Atomic Energy Central School – 1, DAE Colony, ECIL Post, Hyderabad – 500 062.
3. ప్రిపరేటరీ టీచర్లు:
- సీనియర్ సెకండరీ స్కూల్, ఇంటర్మీడియట్, డిప్లొమా ఉత్తీర్ణత.
- వయసు: 30 ఏళ్లు మించకూడదు.
- జీతభత్యాలు: నెలకు రూ.21250 వరకు చెల్లిస్తారు.
- పరీక్ష తేది: మార్చి 03, 2021.
- వేదిక: Atomic Energy Central School – 1, DAE Colony, ECIL Post, Hyderabad – 500 062.
ముఖ్య సమాచారం:
- ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ఆధారంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: Security Office, DAE Colony, D-Sector Gate, ECIL Post, Hyderabad.
- దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 25, 2021
- వెబ్‌సైట్:https://www.nfc.gov.in/
- Download the notification
- Download the corrigendum notification
- Download application form
No comments:
Post a Comment