Aadhaar PVC Card | మీరు ఆధార్ కార్డును ఎప్పుడూ జేబులో మెయింటైన్ చేయాలనుకుంటున్నారా? పాన్ కార్డ్, క్రెడిట్ కార్డ్ సైజులో ఆధార్ కార్డు పొందొచ్చు. ఆధార్ పీవీసీ కార్డును అందిస్తోంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI. ఎలా పొందాలో తెలుసుకోండి.
1. ఆధార్ కార్డు మందంగా ఉన్న పేపర్‌పై ప్రింట్ చేసి ఇస్తారన్న సంగతి తెలిసిందే. ఆ కార్డును కట్ చేసి ల్యామినేట్ చేసి జేబులో పెట్టుకోవడం అలవాటుగా మారిపోయింది. ఆధార్ కార్డును ఐడీ కార్డుగా, అడ్రస్ ప్రూఫ్‌గా ఉపయోగించొచ్చు కాబట్టి జేబులో, పర్సులో మెయింటైన్ చేస్తుంటారు.2. ప్రజలు ఆధార్ కార్డును మెయింటైన్ చేస్తున్న తీరు చూసి ఇటీవల యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI ఆధార్ పీవీసీ కార్డును రూపొందించింది. ఇది క్రెడిట్ కార్డ్, ఏటీఎం కార్డులా ఉంటుంది. జేబులో, పర్సులో పెట్టుకోవచ్చు.
Aadhaar Card: ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ ఆన్‌లైన్‌లోనే మార్చేయండి ఇలా
3. ఆధార్ పీవీసీ కార్డ్ పైన డిజిటల్ సంతకం, క్యూఆర్ సెక్యూరిటీ కోడ్, డెమొగ్రఫిక్ డీటైల్స్ లాంటి ఆధార్ పీవీసీ కార్డు ఫుల్ సెక్యూర్డ్‌గా ఉంటుంది. ఆధార్ కార్డ్ హోల్డర్స్ ఎవరైనా ఆధార్ పీవీసీ కార్డ్ తీసుకోవచ్చు.
Aadhaar Card: మీ ఆధార్ కార్డుకు లింక్ చేసిన మొబైల్ నెంబర్ ఏదో 2 నిమిషాల్లో తెలుసుకోండిలా
4. యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్, రెసిడెంట్ పోర్టల్‌లో 12 అంకెల ఆధార్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్-UID లేదా 16 అంకెల వర్చువల్ ఐడెంటిఫికేషన్ నెంబర్- VID లేదా 28 అంకెల ఎన్‌రోల్‌మెంట్ ఐడీ-EID ఎంటర్ చేసి ఆధార్ పీవీసీ కార్డు తీసుకోవచ్చు. ఇందుకోసం రూ.50 చెల్లించాలి. ఇందులోనే జీఎస్‌టీ, స్పీడ్ పోస్ట్ ఛార్జీలు ఉంటాయి.
Aadhaar Card: ఆధార్ నెంబర్ మర్చిపోయారా? సింపుల్‌గా 3 నిమిషాల్లో తెలుసుకోండి ఇలా
5. ఆధార్ పీవీసీ కార్డ్ ఎలా ఆర్డర్ చేయడానికి https://uidai.gov.in/ హోమ్ పేజీ ఓపెన్ చేయాలి. My Aadhaar సెక్షన్‌లో Order Aadhaar PVC Card ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సెక్యూరిటీ కోడ్ లేదా క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.
6. మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. మీ మొబైల్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి. టర్మ్స్ అండ్ కండీషన్స్ అంగీకరించి సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
Aadhaar Card: ఆధార్ కార్డులో ఫోటో నచ్చలేదా? ఇలా మార్చేయండి
7. పేమెంట్ విజయవంతంగా పూర్తైన తర్వాత ఆర్డర్ ప్లేస్ అవుతుంది. ఐదు వర్కింగ్ డేస్‌లో మీ అడ్రస్‌కు స్పీడ్ పోస్ట్‌లో ఆధార్ పీవీసీ కార్డ్ వస్తుంది. ఆధార్ పీవీసీ కార్డ్ ఆర్డర్ స్టేటస్ కూడా చెక్ చేయొచ్చు.
8. ఆధార్ పీవీసీ కార్డ్ ఆర్డర్ స్టేటస్ చెక్ చేయడానికి ఇందుకోసం https://uidai.gov.in/ హోమ్ పేజీ ఓపెన్ చేయాలి. My Aadhaar సెక్షన్‌లో Check Aadhaar PVC Card Status ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.
9. ఆ తర్వాత సెక్యూరిటీ కోడ్ లేదా క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. మీ మొబైల్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి. టర్మ్స్ అండ్ కండీషన్స్ అంగీకరించి సబ్మిట్ చేయాలి. ఆధార్ పీవీసీ కార్డ్ ప్రింట్ స్టేటస్ తెలుస్తుంది.
No comments:
Post a Comment