NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Feb 9, 2021

Aadhaar Card: ఆధార్ నెంబర్ మర్చిపోయారా? సింపుల్‌గా 3 నిమిషాల్లో తెలుసుకోండి ఇలా

  SSK       Feb 9, 2021

Aadhaar Card | ఆధార్ కార్డు పోయిందా? ఆధార్ నెంబర్ మర్చిపోయారా? సింపుల్‌గా మీ ఆధార్ నెంబర్ తెలుసుకోండి ఇలా.

మీరు మీ ఆధార్ నెంబర్ మర్చిపోయారా? ఎక్కడైనా ఆధార్ నెంబర్ ఇవ్వాల్సిన టైమ్‌లో జేబులో ఆధార్ కార్డ్ లేకపోయినా, ఆధార్ నెంబర్ తెలియకపోయినా ఇబ్బంది తప్పదు. కానీ చాలా సింపుల్‌గా మీరు మీ ఆధార్ నెంబర్ తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీరు ఆధార్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీ దగ్గర స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు. సులువుగా మీ ఆధార్ నెంబర్ తెలుసుకోవచ్చు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI అనేక ఆధార్ సేవల్ని ఆన్‌లైన్‌లో అందిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు టెక్నాలజీని ఉపయోగించుకోని స్మార్ట్‌ఫోన్ ద్వారానే చాలా సేవల్ని అందిస్తోంది యూఐడీఏఐ. మీరు మీ ఆధార్ నెంబర్‌ను తెలుసుకోవడం అందులో ఒకటి. అయితే మీరు మీ ఆధార్ నెంబర్ తెలుసుకోవాలంటే మీ మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్‌కు లింక్ అయి ఉండాలి. అప్పుడే ఆధార్ నెంబర్ తెలుసుకోవడం సాధ్యమవుతుంది. మరి ఆధార్ నెంబర్ ఎలా తెలుసుకోవచ్చో, ఏ స్టెప్స్ ఫాలో కావాలో తెలుసుకోండి.

  • ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ ఓపెన్ చేయాలి.
  • My Aadhaar సెక్షన్‌లో Aadhaar Services లో Retrieve Lost or Forgotten EID/UID పైన క్లిక్ చేయాలి.
  • కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Aadhaar No (UID) సెలెక్ట్ చేయాలి.
  • ఆ తర్వాత పూర్తి పేరు ఎంటర్ చేయాలి.
  • ఆ తర్వాత మొబైల్ నెంబర్ లేదా ఇమెయిల్ ఐడీ టైప్ చేయాలి.
  • తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి Send OTP పైన క్లిక్ చేయాలి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
  • 6 అంకెల ఓటీపీ ఎంటర్ చేయాలి.
  • Login పైన క్లిక్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌ లేదా ఇమెయిల్ ఐడీకి మీ ఆధార్ నెంబర్ వస్తుంది.

ఎన్‌రోల్‌మెంట్ ఐడీ పొందడానికి కూడా ఇవే స్టెప్స్ ఫాలో కావాలి. అయితే Enrolment ID (EID) పైన క్లిక్ చేయాలి. ఇలా సులువుగా మీ ఆధార్ నెంబర్ తెలుసుకోవాలన్నా, ఇతర సేవలు పొందాలన్నా మీ ఆధార్ నెంబర్‌కు తప్పనిసరిగా మొబైల్ నెంబర్ లింక్ చేయండి.
logoblog

Thanks for reading Aadhaar Card: ఆధార్ నెంబర్ మర్చిపోయారా? సింపుల్‌గా 3 నిమిషాల్లో తెలుసుకోండి ఇలా

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...