SSC MTS Recruitment 2021: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... ఈ తేదీ గుర్తుంచుకోండి
SSC MTS Recruitment 2021 | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునేవారికి గుడ్ న్యూస్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మరో నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC నాన్ టెక్నికల్ విభాగంలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్-MTS పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఫిబ్రవరి 2న ఈ ఈ నోటిఫికేషన్ విడుదల కానుంది. అర్హులైన అభ్యర్థులంతా ఫిబ్రవరి 2 నుంచి మార్చ్ 18 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జూలై 1 నుంచి జూలై 20 2021 మధ్య జరగున్న SSC MTS రాత పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. కనీస విద్యార్హతగా 10వ తరగతి లేదా దీనికి సమానమైన కోర్సులో పాస్ కావాలి. 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉండాలి. గతేడాది 7099 ఖాళీల కోసం వివిధ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించిన కమిషన్... ఈసారి కూడా దాదాపు అన్నే ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేస్తోందనే అంచనాలున్నాయి.SSC MTS Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన తేదీలు
- దరఖాస్తు ప్రారంభం- 02 ఫిబ్రవరి 2021
- అప్లికేషన్‌కు చివరి తేదీ- 18 మార్చ్ 2021
- ఫీ పేమెంట్‌కు చివరి తేదీ- వెల్లడించాల్సి ఉంది
- చలాన్ జనరేషన్‌కు లాస్ట్ డేట్- వెల్లడించాల్సి ఉంది
- చలాన్ పేమెంట్‌కు లాస్ట్ డేట్- వెల్లడించాల్సి ఉంది
- పేపర్ 1 ఎగ్జామ్- 01జూలై-20జూలై 2021
SSC MTS Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
- వేతనం- రూ. 5,200-20,200 + గ్రేడ్ పే రూ.1800
- విద్యార్హత- 10వ తరగతి పాస్ అయి ఉండాలి
- జాతీయత- భారతీయ పౌరుడు అయి ఉండాలి లేదా సబ్టెక్ట్ ఆఫ్ నేపాల్, లేదా సబ్జెక్ట్ ఆప్ భూటానా లేదా 1962, జనవరి 1 లోగా మనదేశానికి వచ్చిన టిబెటన్ రెఫ్యుజీ అయి ఉండాలి. భారతదేశంలో పుట్టినవారై ఉండాలి లేదా భారతీయ మూలాలు ఉండి పాక్, బర్మా, శ్రీలంక, ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ అయిన కెన్యా, ఉగాండా, యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియా, జాంబియా, మలావి, జైరి, ఇథియోపియా, వియత్నాం నుంచి మనదేశానికి వలసవచ్చి ఉండి, మన దేశంలోనే స్థిరంగా ఉండే ఉద్దేశం ఉన్నవారై ఉండాలి. వీటన్నింటిని ధ్రువపరిచే సరైన అధికారిక పత్రాలు కలిగి ఉండటం తప్పనిసరి.
- వయస్సు- జనరల్ అభ్యర్థులకు 18-25 ఏళ్లు. SC/ST అభ్యర్థులకు 18-30 ఏళ్లు. OBC అభ్యర్థులకు 18-28 ఏళ్లు.
- ఎంపిక విధానం- పేపర్ 1, పేపర్ 2, డాక్యుమెంట్ వెరిఫికేషన్
SSC MTS ఎగ్జామ్ ప్యాటర్న్ (పేపర్ 1)
ఇది ఆబ్జెక్టివ్ టైప్, ఆన్ లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలుంటాయి. జనరల్ ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్& రీజనింగ్, న్యూమెరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ సబ్జెక్టుల్లో 25 మార్కుల చొప్పున ప్రశ్నలుంటాయి. జనరల్ ఇంగ్లీష్ తప్ప మిగతా అన్ని సబ్జెక్టులు హిందీ లేదా ఇంగ్లీష్ మీడియంలో పరీక్షలు రాయవచ్చు. నెగటివ్ మార్కులు ఉంటాయి కాబట్టి ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కులు కట్ అవుతాయి. పరీక్ష రాసేందుకు గంట 30 నిమిషాల సమయం ఇస్తారు. ఇగ మిగతా వివరాలకు SSC వెబ్ సైట్ ను సందర్శించండి.
No comments:
Post a Comment