1. తెలంగాణలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్-SCCL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నాన్ ఎగ్జిక్యూటీవ్ కేడర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 372 ఖాళీలను ప్రకటించింది. ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్ లాంటి పోస్టులు ఉన్నాయి.
2. ఈ పోస్టులకు 2021 జనవరి 22న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 2021 ఫిబ్రవరి 4 సాయంత్రం 5 గంటల్లోగా అప్లై చేయాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://scclmines.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అప్లై చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.
3. మొత్తం 372 ఖాళీలు ఉండగా అందులో ఫిట్టర్- 128, ఎలక్ట్రీషియన్- 51, వెల్డర్- 54, టర్నర్ లేదా మెషినిస్ట్ ట్రైనీ- 22, మోటార్ మెకానిక్ ట్రైనీ- 14, ఫౌండర్ మెన్ లేదా ముల్డర్ ట్రైనీ- 19, జూనియర్ స్టాఫ్ నర్స్- 84 పోస్టులున్నాయి.
4. విద్యార్హతల వివరాలు చూస్తే ఫిట్టర్ పోస్టుకు 10వ తరగతి పాస్ కావడంతో పాటు ఫిట్టర్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి. నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్‌లో నేషనల్ అప్రెంటీస్ సర్టిఫికెట్ ఉండాలి.
5. ఎలక్ట్రీషియన్ పోస్టుకు 10వ తరగతి పాస్ కావడంతో పాటు ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి. నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్‌లో నేషనల్ అప్రెంటీస్ సర్టిఫికెట్ ఉండాలి.
6. వెల్డర్ పోస్టుకు 10వ తరగతి పాస్ కావడంతో పాటు వెల్డర్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి. నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్‌లో నేషనల్ అప్రెంటీస్ సర్టిఫికెట్ ఉండాలి.
7. టర్నర్ లేదా మెషినిస్ట్ ట్రైనీ పోస్టుకు 10వ తరగతి పాస్ కావడంతో పాటు టర్నర్ లేదా మెషినిస్ట్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి. నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్‌లో నేషనల్ అప్రెంటీస్ సర్టిఫికెట్ ఉండాలి.
8. మోటార్ మెకానిక్ ట్రైనీ పోస్టుకు 10వ తరగతి పాస్ కావడంతో పాటు మోటార్ మెకానిక్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి. నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్‌లో నేషనల్ అప్రెంటీస్ సర్టిఫికెట్ ఉండాలి.
9. ఫౌండర్ మెన్ లేదా ముల్డర్ ట్రైనీ పోస్టుకు 10వ తరగతి పాస్ కావడంతో పాటు మౌల్డర్ ట్రేడ్ లేదా ఫౌండ్రీ మ్యాన్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి. నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్‌లో నేషనల్ అప్రెంటీస్ సర్టిఫికెట్ ఉండాలి.
10. జూనియర్ స్టాఫ్ నర్స్ పోస్టుకు ఇంటర్మీడియట్ పాస్ కావడంతో పాటు జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫరీ డిప్లొమా లేదా సర్టిఫికెట్ కోర్స్ పూర్తి చేసి ఉండాలి. లేదా బీఎస్‌సీ నర్సింగ్ పాస్ కావాలి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 35 ఏళ్లు.
11. ఈ పోస్టులకు అప్లై చేయడానికి అభ్యర్థులు ముందుగా https://scclmines.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో CAREERS సెక్షన్‌లో Recruitment పైన క్లిక్ చేయాలి. అందులో Notification పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత Click here for Details & Apply Online పైన క్లిక్ చేయాలి. Please Click here for a copy of Detailed Notification పైన క్లిక్ చేయాలి. నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది.
12. నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. ఆ తర్వాత Apply Online పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత అప్లై చేయాలనుకున్న పోస్టును సెలెక్ట్ చేయాలి. పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, ఇతర వివరాలతో దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి. దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
No comments:
Post a Comment