NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Jan 23, 2021

SBI Recuritment 2021

  SSK       Jan 23, 2021

 SBI Recuritment 2021: ఎస్‌బీఐలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... అప్లై చేయండి ఇలా...

SBI Recuritment 2021 | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.

SBI Recuritment 2021
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్-SCO భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ఇప్పటికే 489 పోస్టులకు ఓ నోటిఫికేషన్, 16 పోస్టులకు మరో నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తుల్ని స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్- మేనేజర్ (రీటైల్ ప్రొడక్ట్స్) పోస్టుల్ని ప్రకటించింది. 5 ఖాళీలను ప్రకటించింది. ఈ పోస్టులకు 2021 జనవరి 22న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 ఫిబ్రవరి 12 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://www.sbi.co.in/ లేదా https://bank.sbi/web/careers వెబ్‌సైట్‌లో కెరీర్స్ సెక్షన్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు నోటిఫికేషన్ చదివిన తర్వాత విద్యార్హతలు ఉంటే ఈ పోస్టులకు అప్లై చేయాలి. 2020 సెప్టెంబర్ 18న ఎస్‌బీఐ విడుదల చేసిన నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసిన అభ్యర్థులు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదు.

SBI Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

  • మొత్తం స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్- మేనేజర్ (రీటైల్ ప్రొడక్ట్స్) ఖాళీలు- 5
  • దరఖాస్తు ప్రారంభం- 2021 జనవరి 22
  • దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఫిబ్రవరి 12
  • విద్యార్హతలు- ఫుల్ టైమ్ ఎంబీఏ లేదా పీజీడీఎం లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ డిగ్రీ పాస్ కావాలి. ఫుల్ టైమ్ బీఈ, బీటెక్ పాస్ కావాలి.
  • దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
  • వయస్సు- 25 నుంచి 35 ఏళ్లు
  • ఎంపిక విధానం- దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ
  • దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.

SBI SCO Recruitment 2021: అప్లై చేయండి ఇలా

  • అభ్యర్థులు ముందుగా https://www.sbi.co.in/ లేదా https://bank.sbi/web/careers వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  • Apply Online పైన క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  • కొత్త పేజీలో Click for New Registration పైన క్లిక్ చేయాలి.
  • పేరు, పుట్టిన తేదీ, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ చేయాలి.
  • ఆ తర్వాత స్టెప్‌లో ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.
  • మూడో స్టెప్‌లో క్వాలిఫికేషన్ వివరాలు ఎంటర్ చేయాలి.
  • నాలుగో స్టెప్‌లో ఓసారి దరఖాస్తులో సబ్మిట్ చేసిన వివరాలన్నీ సరిచూసుకోవాలి.
  • చివరి స్టెప్‌లో పేమెంట్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
  • దరఖాస్తు ఫామ్ పూర్తి చేసిన తర్వాత ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

logoblog

Thanks for reading SBI Recuritment 2021

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...