ఎస్‌బీఐలో మేనేజర్ జాబ్స్.. బీఈ/బీటెక్, ఎంబీఏ వాళ్లు అర్హులు.. జీతం రూ.78,230
SBI Manager Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఎంపికైన అభ్యర్థులు ముంబైలో పనిచేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలను https://bank.sbi/careers వెబ్‌సైట్‌లో చూడొచ్చు.ముఖ్య సమాచారం:
- పోస్టు పేరు: మేనేజర్ (రిటైల్ ప్రొడక్ట్స్)
- అర్హత: ఎంబీఏ లేదా పీజీడీఎం లేదా బీఈ లేదా బీటెక్ చేసి ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం తప్పనిసరి.
- ఎంపిక ప్రక్రియ: దరఖాస్తు చేసుకున్నవారి విద్యార్హతలు, అనుభవాన్ని బట్టి అభ్యర్థులను ఎంపికచేస్తారు. వారిని ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు ఫీజు: రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజులేదు.
- దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 12
- వెబ్‌సైట్: https://bank.sbi/careers
Also Read: UPSC Recruitment 2021
MBA final year students are eligible or not for this post
ReplyDeleteHello Amigo! MBA final year students are not Eligible for this Post.
DeleteThanks for your Comment.