NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Jan 16, 2021

PFC Recruitment 2021

  SSK       Jan 16, 2021

 PFC Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు..

Power Finance Corporation of India Jobs: నిరుద్యోగులకు ఢిల్లీలోని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Power Finance Corporation (PFC) Limited Recruitment Notification 2021: Power Finance Corporation (PFC) Limited has invited applications for the Project Coordinator and Consultant posts. Interested and eligible persons can apply for Power Finance Corporation (PFC) Limited Recruitment Notification 2020 through the prescribed application format on or before 18 January 2021.

PFC_Recruitment_2021

నిరుద్యోగులకు ఢిల్లీలోని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 41 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

ఎంపికైన అభ్యర్థులు కాంట్రాక్టు ప్రాతిపాదికన పని చేయాల్సి ఉంటుంది. బీఈ, బీటెక్ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ జనవరి 18.

ఖాళీలు, అర్హతల వివరాలు..: ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ విభాగంలో మొత్తం 34 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఐటీ/కంప్యూటర్ సైన్స్/ఎలక్ట్రికల్ తదితర విభాగాల్లో BE/B.Tech చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తుకు అర్హులు. ఈ పోస్టుకు అభ్యర్థుల వయస్సు 21-45 ఏళ్లు ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి.

కన్సల్టెంట్ టెక్నికల్-1 విభాగంలో మొత్తం ఆరు ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఐటీ/కంప్యూటర్ సైన్స్/ఎలక్ట్రికల్ తదితర విభాగాల్లో BE/B.Tech చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. సంబంధిత విభాగంలో ఐదేళ్ల అనుభవం ఉండాలి. వయస్సు 21-45 ఏళ్లు ఉండాలి.

కన్సల్టెంట్ టెక్నికల్-2 ఈ విభాగంలో ఒక పోస్టును భర్తీ చేయనున్నారు. ఐటీ/కంప్యూటర్ సైన్స్ సబ్జెకుల్లో బీఈ/బీటెక్/ఎంసీఏ విద్యార్హత కలిగిన వారు దరఖాస్తుకు అర్హులు. వయస్సు 21-45 ఏళ్లు ఉండాలి. ఇతర విద్యార్హతల వివరాలను నోటిఫికేషన్లో చూసుకోవచ్చు.

మొదట దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హత ఉన్న వారిని గుర్తించి షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన వారిని ఇంటర్వ్యూలకు ఆహ్వానించనున్నారు. అధికారిక వెబ్ సైట్: https://www.pfcindia.com/

logoblog

Thanks for reading PFC Recruitment 2021

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...