NFL Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. ఆ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
National Fertilizers Limited (NFL) has invited applications for the Management Trainee posts. Interested and eligible persons can apply for National Fertilizers Limited (NFL) Recruitment Notification 2020 through the prescribed application format on or before 21 January 2021.
NFL Recruitment 2021: Apply Online for 30 Management Trainee Posts @nationalfertilizers.com
నిరుద్యోగులకు నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్(NFL) శుభవార్త చెప్పింది. మేనేజ్మెంట్ ట్రైనీ విభాగంలో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
నిరుద్యోగులకు నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్(NFL) శుభవార్త చెప్పింది. మేనేజ్మెంట్ ట్రైనీ విభాగంలో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆన్లైన్ టెస్ట్ నిర్వహించి అందులో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 40 వేల నుంచి రూ.1.40 లక్షల వరకు వేతనం చెల్లించనున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 30 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అందుకు సంబంధించిన అర్హతల వివరాలు ఇలా ఉన్నాయి.
- కెమికల్ విభాగంలో మొత్తం నాలుగు ఖాళీలను భర్తీ చేస్తుననారు. కెమికల్ ఇంజనీరింగ్ లో బీఈ, బీటెక్, బీఎస్సీ చేసినవారు దరఖాస్తుకు అర్హులు.
- మెకానికల్ విభాగంలో మొత్తం 7 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ లో బీఈ/బీటెక్/బీఎస్సీ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు.
- ఎలక్ట్రికల్ విభాగంలో మొత్తం 4 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు.
- Instrumentation విభాగంలో మొత్తం 5 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఆయా సబ్జెక్టులో బీఈ, బీటెక్, బీఎస్సీ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. ఇతర వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
- కెమికల్ ల్యాబ్ లో 7 పోస్టులను భర్తీ చేయనున్నారు. కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు.
- ఫైర్ అండ్ సేఫ్టీ విభాగంలో మొత్తం 2 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆయా సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. ఇతర వివరాలను నోటిఫికేషన్లో చూసుకోవచ్చు.
ఎలా అప్లై చేయాలంటే..
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 21లోగా సంస్థ అధికారిక వెబ్ సైట్లో అప్లై చేయాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రూ. 700 అప్లికేషన్ ఫీజును అభ్యర్థులు చెల్లించాల్సి ఉంటుంది. SC, ST, PwBD, ExSM అభ్యర్థులకు ఫీజులు మినహాయింపు ఉంటుంది.
No comments:
Post a Comment