NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Jan 17, 2021

Ministry of Defence Recruitment 2021

  SSK       Jan 17, 2021

 Govt Jobs 2021: టెన్త్, ఇంటర్ అర్హతతో డిఫెన్స్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Govt Jobs 2021 | టెన్త్, ఇంటర్ అర్హతతో పలు ఖాళీలను భర్తీ చేస్తోంది డిఫెన్స్ మంత్రిత్వ శాఖ. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

Ministry_of_Defence_Recruitment_2021
Ministry of Defence Recruitment 2021: Ministry of Defence has invited applications for recruitment of various posts on its official website @mod.gov.in. The recruitment will be held for 39 vacancies for this post of Stenographer, MTS, lower division clerk, and other posts. The interested and eligible candidates should apply for the recruitment on or before 15th February 2021.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. టెన్త్, ఇంటర్మీడియట్ అర్హతతో డిఫెన్స్‌లో ఉద్యోగాలు పొందేందుకు మంచి అవకాశం ఇది. కేంద్ర డిఫెన్స్ మంత్రిత్వ శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్-MTS, లోయర్ డివిజన్ క్లర్క్-LDC, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 39 ఖాళీలున్నాయి. మధ్య ప్రదేశ్‌లోని ఆర్మీ వార్ కాలేజీ హెడ్ క్వార్టర్స్‌లో ఈ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 ఫిబ్రవరి 15 చివరి తేదీ. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.mod.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు ఫామ్ నోటిఫికేషన్‌లో ఉంటుంది. దరఖాస్తు పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పోస్టులో పంపాలి.

Ministry of Defence Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే

మొత్తం ఖాళీలు- 39

  • సినిమా ప్రొజెక్టనిస్ట్- 1
  • స్టెనోగ్రాఫర్- 1
  • లోయర్ డివిజన్ క్లర్క్-LDC- 1
  • సివిలియన్ మోటార్ డ్రైవర్- 4
  • ఎలక్ట్రీషియన్- 1
  • కుక్- 2
  • పోస్టర్ మేకర్- 1
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (వాచ్ మ్యాన్)- 4
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (సఫాయీవాలా)- 2
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (గార్డెనర్)- 1
  • బార్బర్- 1
  • ఫాటిగ్ మ్యాన్- 8
  • సూపర్‌వైజర్- 1
  • ఓవర్‌సీర్- 1
  • సైకిల్ ఫిట్టర్- 1

Ministry of Defence Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

  • దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఫిబ్రవరి 15
  • విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. టెన్త్, ఇంటర్ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. విద్యార్హతల వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
  • దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:The Presiding Officer, Civilian Direct Recruitment (Scrutiny of Applications) Board, Senior Command Wing, Army War College, Mhow (MP) – 453441.

logoblog

Thanks for reading Ministry of Defence Recruitment 2021

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...