NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Jan 17, 2021

Indian Navy Recruitment 2021

  SSK       Jan 17, 2021

 Indian Navy Recruitment 2021: ఇంటర్ పాసైనవారికి గుడ్ న్యూస్... ఇండియన్ నేవీలో ఉద్యోగాలు

Indian_Navy_Recruitment_2021
Indian Navy Recruitment 2021 | ఇంటర్ పాసైనవారు ఇండియన్ నావల్ అకాడమీలో బీటెక్ కోర్సు చేయొచ్చు. దరఖాస్తు ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

Indian Navy 10+2 B.Tech 2021 Notification: Indian Navy has published the recruitment notification for a four year degree course 10+2 (B.Tech) Cadet Entry Scheme (Permanent Commission) commencing from July 2021. Unmarried Male Candidates (fulfilling the conditions of nationality as laid down by the Govt. of India) can apply for Indian Navy 10+2 B.Tech Cadet Entry Scheme on official website of Indian Navy (joinindiannavy.gov.in) from 29 January 2021. The last date for Indian Navy Online Application is 09 February 2021.

ఇంటర్మీడియట్ పాసైనవారికి గుడ్ న్యూస్. ఇండియన్ నేవీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. జూలై 2021 సెషన్ కోసం ఈ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 26 ఖాళీలను భర్తీ చేయనుంది ఇండియన్ నేవీ. ఎడ్యుకేషన్, ఎగ్జిక్యూటీవ్, టెక్నికల్ బ్రాంచ్‌లల్లో ఈ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు 2021 జనవరి 29న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అప్లై చేయడానికి 2021 ఫిబ్రవరి 9 చివరి తేదీ. పెళ్లికాని యువకులు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేయాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.joinindiannavy.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఈ వెబ్‌సైట్‌లోనే అప్లై చేయాలి.

ఎంపికైన అభ్యర్థులు 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ద్వారా బీటెక్ కోర్సు చేయొచ్చు.కేరళలోని ఇండియన్ నేవల్ అకాడమీలో నాలుగేళ్ల కోర్సు ఉంటుంది. అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో నాలుగేళ్ల బీటెక్ కోర్సు చేయాల్సి ఉంటుంది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి జవరహ్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి బీటెక్ డిగ్రీ వస్తుంది.

Indian Navy 10+2 (B.Tech) Cadet Entry Scheme 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

మొత్తం ఖాళీలు- 26

  • ఎడ్యుకేషన్ బ్రాంచ్- 5
  • ఎగ్జిక్యూటీవ్ అండ్ టెక్నికల్ బ్రాంచ్- 21
  • కోర్సులు- అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో నాలుగేళ్ల బీటెక్ కోర్సు
  • దరఖాస్తు ప్రారంభం- 2021 జనవరి 29
  • దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఫిబ్రవరి 9
  • ఇంటర్వ్యూ- 2021 మార్చి నుంచి జూన్ వరకు
  • విద్యార్హత- 10+2 లేదా తత్సమాన పరీక్ష పాసైనవారు దరఖాస్తు చేయొచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లో కనీసం 70% మార్కులు ఉండాలి. ఇంగ్లీష్‌లో 50% మార్కులుండాలి. జేఈఈ మెయిన్ 2020 ఎగ్జామ్ పాస్ కావాలి.
  • వయస్సు- 2002 జనవరి 2 నుంచి 2004 జూలై 1 మధ్య జన్మించినవారు అప్లై చేయాలి.
  • ఎంపిక విధానం- జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంక్ ఆధారంగా ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూ రెండు దశల్లో ఉంటుంది. స్టేజ్ 1 లో ఇంటెలిజెన్స్ టెస్ట్, పిక్చర్ పర్సెప్షన్, గ్రూప్ డిస్కషన్ ఉంటాయి. స్టేజ్ 1 క్వాలిఫై అయినవారికి సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టెస్టింగ్, ఇంటర్వ్యూ ఉంటాయి. రెండు దశల ఇంటర్వ్యూ విజయవంతంగా పూర్తి చేసిన వారికి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.
  • ఇంటర్వ్యూ నిర్వహించే ప్రాంతం- విశాఖపట్నం, కోల్‌కతా, భోపాల్, బెంగళూరు.

logoblog

Thanks for reading Indian Navy Recruitment 2021

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...