Indian Army Recruitment 2021: Apply for 194 Junior Commissioned Officers (JCO) posts before this date
Indian Army has invited the application the recruitment Religious Teachers in Indian Army as Junior Commissioned Officers for RRT 91, 92, 93, 94 and 95 courses on its website - joinindianarmy.nic.in.
Indian Army Recruitment 2021: Interested candidates can apply for Indian Army Religious Teacher Recruitment 2021 from January 11, 2021, i.e., today.
ఇండియన్ ఆర్మీ ఆర్‌ఆర్‌టీ 91, 92, 93, 94, 95 కోర్సుల ద్వారా 194 జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్లు (రిలీజియస్ టీచర్ల) నియామకానికి అర్హతగల పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై వాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్ స్టాండర్డ్ అండ్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 9 దరఖాస్తులకు చివరితేది. పూర్తి వివరాలకు http://joinindianarmy.nic.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
మొత్తం ఖాళీలు: 194
1) పండిట్: 171
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు హిందు అభ్యర్థులు సంస్కృతంలో ఆచార్య అర్హత ఉండాలి.
2) పండిట్ (గోర్ఖా-గోర్ఖా రెజిమెంట్స్ కోసం): 09
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు హిందు అభ్యర్థులు సంస్కృతంలో ఆచార్య అర్హత ఉండాలి.
3) గ్రంథి: 05
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సిక్కు అభ్యర్థులకు పంజాబీలో గ్యానీ అర్హత ఉండాలి.
4) మౌల్వి (సున్నీ): 05
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ముస్లిం అభ్యర్థులకు అరబిక్‌లో మౌల్వీ అలీం/ ఉర్దూలో అదిబ్ అలీం అర్హత ఉండాలి.
5) మౌల్వి (షియా) లద్ధాఖ్ స్కౌట్స్: 01
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ముస్లింలకు అరబిక్‌లో మౌల్వీ అలీం/ ఉర్దూలో అదిబ్ అలీం అర్హత ఉండాలి.
6) పాడ్రే: 02
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు స్థానిక బిషప్‌గా ఆమోదించబడి ప్రస్తుతం ఆ పనిలో కొనసాగుతూ ఉండాలి.
7) బోధ్ సన్యాసి (మహాయాన) లద్ధాఖ్ స్కౌట్స్ కోసం: 01
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు బోధ్ సన్యాసిగా గుర్తించబడి, కాన్పా/ లోపాన్/ రబ్‌జాంలో పీహెచ్‌డీ సర్టిఫికెట్ ఉండాలి.
ముఖ్య సమాచారం:
- వయసు: సివిలియన్ మరియు ఇన్-సర్వీస్ అభ్యర్థులకు సంబంధించి వయస్సు 01.10.2021 నాటికి 25-34 ఏళ్ల మధ్య ఉండాలి. 01.10.1987 - 30.09.1996 మధ్య జన్మించి ఉండాలి.
- ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్ స్టాండర్డ్ అండ్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్ ఆధారంగా.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జనవరి 11, 2021.
- దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 09, 2021.
- పరీక్ష తేది: జూన్ 27, 2021.
- వెబ్‌సైట్: http://joinindianarmy.nic.in/
పరీక్షా విధానం:
మొదట స్క్రీనింగ్ ద్వారా షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థుల స్క్రీనింగ్ ఉంటుంది. స్క్రీనింగ్‌లో షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఉంటుంది.
రాత పరీక్ష:
రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో జనరల్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇది 100 మార్కులకు ఉంటుంది. ఇందులో మొత్తం 50 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. రెండో పేపర్‌లో అభ్యర్థులు ఎంచుకున్న మతపరమైన విషయాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇది కూడా 100 మార్కులకు ఉంటుంది. ఇందులో మొత్తం 50 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
పేపర్-1లో కనీసం 40% మార్కులు సాధించిన అభ్యర్థులకు మాత్రమే పేపర్-2 పరీక్ష ఉంటుంది. పేపర్-1 పరీక్షను కేవలం అర్హత పరీక్షగానే పరిగణనిస్తారు. పేపర్-2లో సాధించిన మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. పేపర్-2, ఇంటర్వూలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలు http://joinindianarmy.nic.in/ వెబ్‌సైట్‌లోని నోటిఫికేషన్‌లో చూడొచ్చు.
No comments:
Post a Comment