డిగ్రీతో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. దరఖాస్తు ప్రాసెస్ ఇదే
Indian Army Recruitment 2021: Application Process For SSC 49th Course Begins Today | Direct Link Here
Interested and eligible candidates can apply online for Indian Army NCC Special Entry Recruitment 2021 from 08 January to 28 January 2021 by visiting the official website of Indian Army joinindianarmy.nic.in.
Indian Army NCC Special Entry Recruitment 2021: ఈ పోస్టులకు నేటి నుంచి (జనవరి 8) దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.
డిగ్రీ ఉత్తీర్ణులైన నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు కోరుకునే వారి కోసం ఇండియన్ ఆర్మీ ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 49వ కోర్స్ (ఏప్రిల్ 2021) నోటిఫికేషన్ ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 55 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC) విద్యార్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఈ పోస్టులకు నేటి నుంచి (జనవరి 8) దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. దరఖాస్తు చేయడానికి 2021 ఫిబ్రవరి 6 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://www.joinindianarmy.nic.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో 49 వారాల శిక్షణ ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 55
- ఎన్‌సీసీ మెన్- 50 (జనరల్ కేటగిరీ-45, వార్డ్స్ ఆఫ్ బ్యాటిల్ క్యాజువాలిటీస్-5)
- ఎన్‌సీసీ వుమెన్- 5 (జనరల్ కేటగిరీ-4, వార్డ్స్ ఆఫ్ బ్యాటిల్ క్యాజువాలిటీస్-1)
విద్యార్హతలు:
ఏదైనా డిగ్రీ కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 19 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి. అలాగే.. ఎన్‌సీసీలో కనీసం మూడేళ్లు సీనియర్ డివిజన్, సీనియర్ వింగ్‌లో పనిచేసి ఉండాలి. ఎన్‌సీసీ సీ సర్టిఫికెట్ ఎగ్జామ్‌లో బీ గ్రేడ్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. ఎన్‌సీసీ సీ సర్టిఫికెట్ లేనివాళ్లు దరఖాస్తుకు అనర్హులు.
ఎంపిక ప్రక్రియ:
దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామ్ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
- అభ్యర్థులు http://www.joinindianarmy.nic.in/ వెబ్‌సైట్‌లో లాగిన్ కావాలి.
- తర్వాత Officer Entry Application/Login పైన క్లిక్ చేయాలి
- ఆ తర్వాత Registration పైన క్లిక్ చేయాలి.
- పూర్తి వివరాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి.
- రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ‘Apply Online’ పైన క్లిక్ చేయాలి.
- అందులో ‘Apply’ పైన క్లిక్ చేయాలి.
- పూర్తి వివరాలతో అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసి సబ్మిట్ చేయాలి.
No comments:
Post a Comment