NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Jan 6, 2021

IB ACIO 2021 Notification

  SSK       Jan 6, 2021

 డిగ్రీ/ గ్రాడ్యుయేషన్‌తో 2000 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఒక్క క్లిక్‌తో ఇలా అప్లయ్‌ చేసుకోండి


IB ACIO 2021 Notification: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేష‌న్ లేదా త‌త్స‌మాన ప‌రీక్ష‌లో ఉత్తీర్ణ‌త సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

భార‌త ప్ర‌భుత్వానికి చెందిన హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటలిజెన్స్ బ్యూరో దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్య‌లో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ (ఏసీఐఓ) గ్రేడ్-2/ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఐబీ- జ‌న‌ర‌ల్ సెంట్ర‌ల్ స‌ర్వీస్ విభాగం గ్రూపు-సి (నాన్ గెజిటెడ్‌, నాన్ మినిస్టీరియ‌ల్‌) కింద 2000 ఖాళీల్లో నియామకాలకు ప్రక్రియ ప్రారంభించింది.


IB_ACIO_2021_Notification


మొత్తం పోస్టులు: 2000

  • జ‌న‌ర‌ల్ కేట‌గిరి‌- 989
  • ఈడ‌బ్ల్యూఎస్‌- 113
  • ఓబీసీ- 417
  • ఎస్సీ- 360
  • ఎస్టీ- 121


జీతం:

ఈ పోస్టులకు ఎంపికైన అభ్య‌ర్థుల‌కు లెవ‌ల్-7 పేక‌మిష‌న్ కింద నెల‌కు రూ.44,900 నుంచి 1,42,400 వ‌ర‌కు వేత‌నం అందుతుంది. జీతంతో పాటు ఇత‌ర అల‌వెన్సులూ ఉంటాయి. గ్రేడ్-2 ఏసీఐఓలుగా చేరినవారు మూడు లేదా నాలుగేళ్ల అనుభవంతో గ్రేడ్-1 ఏసీఐఓగా పదోన్నతి పొందుతారు. పదేళ్ల సర్వీసు పూర్తయితే డిప్యూటీ సెంట్రల్ ఇంటలిజెన్స్ ఆఫీసర్లు అయ్యే అవకాశం ఉంది.


విద్యార్హతలు:

గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేష‌న్/ త‌త్స‌మాన ప‌రీక్ష‌లో ఉత్తీర్ణ‌త సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 27 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. కంప్యూటర్ ప‌రిజ్ఞానం ఉండాలి. ఎస్సీ/ ఎస్టీల‌కు అయిదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు, డిపార్ట్‌మెంట‌ల్ ఉద్యోగులకు, క్రీడాకారుల‌కు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంది. ‌


ద‌ర‌ఖాస్తు విధానం:

అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. 2021, జనవరి 9 దరఖాస్తులకు చివరి తేదీ. జ‌న‌ర‌ల్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ కేట‌గిరిల‌కు చెందిన పురుషులు ప‌రీక్ష రుసుం రూ.100తోపాటు రిక్రూట్‌మెంట్ ప్రాసెసింగ్ ఛార్జీలు రూ.500 క‌లిపి మొత్తం రూ.600 ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్య‌ర్థులు, ఇత‌ర కేట‌గిరిల‌కు చెందిన మ‌హిళ‌లు ప‌రీక్ష రుసుం మిన‌హాయించి రిక్రూట్‌మెంట్ ప్రాసెసింగ్ ఛార్జీలు రూ.500 చెల్లిస్తే స‌రిపోతుంది. ఎస్‌బీఐ చ‌లానా ద్వారా చెల్లించే అభ్య‌ర్థుల‌కు జ‌న‌వ‌రి 12, 2021 వ‌ర‌కు చెల్లించవచ్చు.


ఎంపిక విధానం:

అభ్య‌ర్థుల‌ను రాతప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దీనిలో టైర్‌-1, టైర్-‌2, టైర్‌-3 లెవ‌ల్స్ ఉంటాయి. టై‌ర్‌-1లో 100 మార్కుల‌కు ఆబ్జెక్టివ్ ప‌ద్ధ‌తిలో ఆన్‌లైన్‌లో రాత‌ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. ఇందులో జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, న్యూమ‌రిక‌ల్/ అన‌లిటిక‌ల్‌/ లాజిక‌ల్ ఎబిలిటీ అండ్ రీజ‌నింగ్, ఇంగ్లిష్‌, జ‌న‌ర‌ల్ స్ట‌డీస్ స‌బ్జెక్టుల నుంచి 20 ప్ర‌శ్న‌ల చొప్పున అడుగుతారు.

ఒక్కో ప్ర‌శ్న‌కు ఒక మార్కు. ఇందులో రుణాత్మ‌క మార్కులు ఉంటాయి. ప్ర‌తి త‌ప్పు స‌మాధానికి 1/4 మార్కులు కోత విధిస్తారు. ప‌రీక్షా స‌మ‌యం ఒక గంట‌(60 నిమిషాలు). ఈ ప‌రీక్ష‌లో జ‌న‌ర‌ల్ కేట‌గిరి అభ్య‌ర్థుల‌కు 35, ఓబీసీ/ ఈడ‌బ్ల్యూఎస్ వారికి 34, ఎస్సీ/ ఎస్టీల‌కు 33 మార్కుల‌కు మించి వ‌స్తేనే టైర్‌-2కు అర్హ‌త ల‌భిస్తుంది. ఇక్క‌డ నోటిఫికేష‌న్‌లోని మొత్తం ఖాళీలకు ప‌దింత‌ల మందిని టైర్‌-2 ప‌రీక్ష‌కు షార్ట్‌లిస్టింగ్ చేస్తారు.‌‌

టైర్-2 డిస్క్రిప్టివ్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో పేప‌ర్‌పై ప‌రీక్ష‌రాయాలి. మొత్తం 50 మార్కుల‌కు ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. అడిగిన అంశంపై 30 మార్కుల‌కు వ్యాసం రాయాల్సి ఉంటుంది. ఇంగ్లిష్ కాంప్ర‌హెన్ష‌న్ అండ్ ప్రిస్సీస్ రైటింగ్‌కు 20 మార్కులు కేటాయించారు. ప‌రీక్షా స‌మ‌యం ఒక గంట‌(60 నిమిషాలు). టైర్‌1, టైర్‌2లో అర్హ‌త సాధించిన వారిలో ఖాళీల సంఖ్యకు అయిదింత‌ల మందిని టైర్-‌3కి ఎంపిక చేస్తారు.

టైర్-‌3లో 100 మార్కుల‌కు ఇంట‌ర్వ్యూ ఉంటుంది. ఇందులో అర్హ‌త సాధించిన వారికి చివ‌ర‌గా వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించి శిక్ష‌ణ‌కు ఎంపిక చేస్తారు.


తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్షా కేంద్రాలు

తెలంగాణ‌: హైద‌రాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్‌.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌: గుంటూరు, కాకినాడ‌, క‌ర్నూలు, నెల్లూరు, రాజ‌మండ్రి, తిరుప‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం. అభ్య‌ర్థులు గ‌రిష్ఠంగా మూడు ప‌రీక్షా కేంద్రాలు ఎంపిక చేసుకోవ‌చ్చు.

Official Website: https://www.mha.gov.in/ లేదా https://www.ncs.gov.in/


                                                                     ACIO లాగిన్‌ లింక్‌

logoblog

Thanks for reading IB ACIO 2021 Notification

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...