ఈఎస్‌ఐసీ న్యూఢిల్లీలో స్పెషలిస్ట్ గ్రేడ్-2 పోస్టులు చివరి తేది ఫిబ్రవరి 1
న్యూఢిల్లీలో ఉన్న ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సురెన్స్ కార్పొరేషన్(ఈఎస్‌ఐసీ) ఉత్తరాఖండ్ కార్యాలయంలో పనిచేయడానికి స్పెషలిస్ట్ గ్రేడ్-2 (జూనియర్ స్కేల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobsవివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 07
పోస్టుల వివరాలు: అనస్తేషియా-01, జనరల్ మెడిసిన్-01, జనరల్ సర్జరీ-01, గైనకాలజీ-01, ఆర్థోపెడిక్స్-01, పీడియాట్రిక్స్-01, రేడియాలజీ-01.
అర్హతలు:
అనస్తేషియాలజీ: ఎండీ(అనస్తేషియాలజీ), డీఏ (రెండేళ్ల కోర్సు) ఉత్తీర్ణలవ్వాలి.
జనరల్ మెడిసిన్: ఎండీ (జనరల్, జనరల్ మెడిసిన్, మెడిసిన్-థెరపిక్టిక్స్), ఎంఆర్‌సీపీ ఉత్తీర్ణలవ్వాలి.
జనరల్ సర్జరీ: ఎండీ (సర్జరీ, జనరల్ సర్జరీ) ఉత్తీర్ణలవ్వాలి.
గైనకాలజీ: ఎండీ (సర్జరీ, జనరల్ సర్జరీ) ఉత్తీర్ణలవ్వాలి.
ఆర్థోపెడిక్స్: ఎంఎస్, ఎంసీహెచ్ (ఆర్థో) ఉత్తీర్ణలవ్వాలి.
రేడియో-డయాగ్నోసిస్: ఎండీ (రేడియో-డయాగ్నోసిస్), డీఎంఆర్‌డీ ఉత్తీర్ణలవ్వాలి.
ఎంసీఐ/స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో నమోదు చేసుకోవాలి.
వయసు: ఫిబ్రవరి 1, 2021 నాటికి 45 ఏళ్లు మించకూడదు.
పని అనుభవం:
పీజీ డిగ్రీ అభ్యర్థులకు కనీసం 3 ఏళ్లు అనుభవం ఉండాలి.
పీజీ డిప్లొమా అభ్యర్థులకు కనీసం 5 ఏళ్లు అనుభవం ఉండాలి.
జీతం: కేంద్ర ప్రభుత్వ 7వ పేకమిషన్ ప్రకారం నెలకు రూ.67700/-
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు దరఖాస్తులను పోస్టు ద్వారా ఈఎస్‌ఐ కార్పొరేషన్, పంచదీప్ భవన్, ప్రేమ్ నగర్, వింగ్ నెం.4, శివపురి, ప్రేమనగర్, డెహ్రాడూన్-248007, ఉత్తరాఖండ్ అడ్రస్‌కు పంపించాలి.
దరఖాస్తు ఫీజు: రూ.500/- డీడీ తీసి కార్యాలయం అడ్రస్‌కు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 1, 2021.
No comments:
Post a Comment