ECIL Recruitment 2021: బీటెక్ చేసిన వారికి గుడ్ న్యూస్.. ECILలో రూ. 23 వేల వేతనంతో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
నిరుద్యోగులకు ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ECIL) శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
నిరుద్యోగులకు ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ECIL) శుభవార్త చెప్పింది. హైదరాబాద్ లోని విభాగంలో 19 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందు కోసం ఈసీఐఎల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేయాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ ను మరో ఏడాది పాటు పొడిగించే అవకాశం ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ. 23 వేల వేతనం చెల్లించనున్నారు.
ఎవరు అప్లై చేయాలంటే..
- -ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ లో బీటెక్ చేసి 60 శాతం మార్కులు సాధించిన వారి కోసం 1 ఖాళీని భర్తీ చేయనున్నారు.
- -కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో బీటెక్ చేసి 60 శాతం మార్కులు సాధించిన వారి కోసం మరో మూడు పోస్టులు ఉన్నాయి.
- -కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కోర్సులను 60 శాతం మార్కులతో పూర్తి చేసిన వారి కోసం మరో రెండు ఖాళీలు కేటాయించారు.
- -ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ను 60 శాతం మార్కులతో పూర్తి చేసిన వారి కోసం మరో 4 పోస్టులు ఉన్నాయి.
- -కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీటెక్ చేసి 60 శాతం మార్కులు సాధించిన వారి కోసం మరో 8 పోస్టులు ఉన్నాయి.
- -ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో 60శాతం మార్కులు సాధించిన వారి కోసం 1 పోస్టును కేటాయించారు.
అభ్యర్థులు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ECIL అధికారిక వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొదట వెబ్ సైట్ ఓపెన్ చేసిన అనంతరం ‘Careers’ ఆప్షన్ ఎంచుకోవాలి. అనంతరం ‘e-Recruitment’ పై క్లిక్ చేయాలి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ కాపీని భవిష్యత్ అవసరాల కోసం దాచుకోవాలని నోటిఫికేషన్లో సూచించారు.
అభ్యర్థుల ఎంపిక ఎలా ఉంటుందంటే..
మొదట అభ్యర్థులను వారి మార్కులు, అనుభవం ఆధారంగా 1:5 నిష్పత్తిలో షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం ఆ అభ్యర్థులకు వర్చువల్ గా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అభ్యర్థుల ప్రతిభ, అనుభవం ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఇతర వివరాలను అధికారిక నోటిఫికేషన్ చూడొచ్చు.
Also Read: India Government Mint Recruitment 2021
No comments:
Post a Comment