DRDO Short Term Online Courses
Name: Online Training and Certification Course on Artificial Intelligence & Machine Learning
Overview: The short term training and certification course is a 12 weeks online course offering a mix between fundamentals and advanced topics of various domains of AI & ML such as Probability Theory, Pattern recognition, Big Data Analytics, Computer Vision, Natural Language Processing, Augmented Reality, Deep Learning and related advancements in the domain.
Duration: 12weeks online course(2 hours of contact classes/day & 5 days/week)
Eligibility: Graduate from any discipline.
DRDO Short Term Courses | డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ-DIAT షార్ట్ టర్మ్ కోర్సుల్ని అందిస్తోంది. ఆన్‌లైన్ కోర్సుల వివరాలు తెలుసుకోండి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ లాంటి అంశాల్లో స్కిల్స్ పెంచుకోవాలనుకునేవారికి గుడ్ న్యూస్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ నిధులతో నడుస్తున్న డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ-DIAT విద్యార్థుల కోసం షార్ట్ టర్మ్ కోర్సుల్ని అందిస్తోంది. 2021 ఫిబ్రవరి 28న ఈ కోర్సులు ప్రారంభం అవుతాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్-AI, మెషీన్ లెర్నింగ్-ML టాపిక్స్‌ని ఒకే కోర్సుగా అందిస్తోంది. AI, ML కోర్సుల్లో ప్రాబబిలిటీ థియరీ, ప్యాటర్న్ రికగ్నిషన్, బిగ్ డేటా అనలిటిక్స్, కంప్యూటర్ విజన్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఆగ్యుమెంటెడ్ రియాల్టీ, డీప్ లెర్నింగ్ లాంటి డొమైన్స్‌లో ఫండమెంటల్‌తో పాటు అడ్వాన్స్డ్ టాపిక్స్ ఉంటాయి. సైబర్ సెక్యూరిటీ కోర్సును వేరుగా అందిస్తోంది. ఇవి ఆన్‌లైన్ కోర్సులు. ఈ కోర్సు వ్యవధి 12 వారాలు మాత్రమే. వారానికి ఐదు రోజులు, రోజుకు 2 గంటల చొప్పున లెక్చర్స్ వింటే చాలు. ఈ కోర్సుల్లో చేరాలనుకునేవారికి ముందుగా ఆన్‌లైన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఉంటుంది. ఆన్‌లైన్ ఎంట్రెన్స్ టెస్ట్, రిజిస్ట్రేషన్ ఉచితం.
డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ-DIAT అందిస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్-AI, మెషీన్ లెర్నింగ్-ML, సైబర్ సెక్యూరిటీ కోర్సులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 2021 ఫిబ్రవరి 15 లోగా రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష పాస్ అయినవాళ్లు ఎవరైనా ఈ కోర్సులకు దరఖాస్తు చేయొచ్చు. రిజిస్ట్రేషన్ ఉచితమే. ఎంపికైన విద్యార్థులు రూ.15,000 అడ్మిషన్ ఫీజు చెల్లించాలి. ఈ కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాలను onlinecourse.diat.ac.in లేదా https://www.diat.ac.in/ వెబ్‌సైట్స్‌లో తెలుసుకోవచ్చు.
DRDO Short Term Online Courses: ఆన్‌లైన్ కోర్సుల వివరాలు ఇవే
- కోర్సులు- ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్-AI, మెషీన్ లెర్నింగ్-ML, సైబర్ సెక్యూరిటీ
- దరఖాస్తు ప్రారంభం- 2021 జనవరి 28
- దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఫిబ్రవరి 15
- ఏఐ, ఎంఎల్ కోర్సుకు ఎంట్రెన్స్ టెస్ట్- 2021 ఫిబ్రవరి 20
- సైబర్ సెక్యూరిటీ కోర్సుకు ఎంట్రెన్స్ టెస్ట్- 2021 ఫిబ్రవరి 21
- ఫలితాల విడుదల- 2021 ఫిబ్రవరి 22
- క్వాలిఫై అయిన విద్యార్థులు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ- 2021 ఫిబ్రవరి 26
- కోర్సు ప్రారంభం- 2021 ఫిబ్రవరి 28
- కోర్సు ఫీజు- రూ.15,000
No comments:
Post a Comment