DRDO Recruitment 2021 కరోనా సమయంలోనూ వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల చేసిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ తాజాగా నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. 150 అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
కరోనా సమయంలోనూ వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల చేసిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ తాజాగా నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. 150 అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. సంస్థకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కు చెందిన Gas Turbine Research Establishment (GTRE) కోసం ఈ నియామకాలను చేపట్టారు. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. వారికి నెలకు రూ. 9 వేల చొప్పున స్కాలర్ షిప్ అందించనున్నారు. ఇంత పెద్ద సంస్థలో అప్రెంటీస్ గా ఉద్యోగ జీవితం ప్రారంభిస్తే అనుభవంతో పాటు భవిష్యత్ లో మంచి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
ఎవరు దరఖాస్తు చేసుకోవాలంటే
ఈ ఉద్యోగాలకు ఈ నెల 5 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు కంపెనీ అధికారిక వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
-Graduate apprentice trainees: విభాగంలో 80 ఖాళీలను భర్తీ చేయనున్నారు. సంబంధిత కోర్సుల్లో డిగ్రీ, బీఈ, బీటెక్ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. ఇతర వివరాలను నోటిఫికేషన్ చూసుకోవచ్చు.
-Diploma apprentice trainees: విభాగంలో 30 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంజనీరింగ్ లో డిప్లొమో చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. ఇతర వివరాలను నోటిఫికేషన్లో చూసుకోవచ్చు.
-ITI apprentice trainees: ఈ విభాగంలో మొత్తం 40 ఖాళీలు ఉన్నాయి. సెకండరీ ఎడ్యుకేషన్ తర్వాత రెండేళ్ల పాటు ఒకేషనల్ కోర్సు చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. ఇతర విషయాలను నోటిఫికేషన్లో చూసుకోవచ్చు.
ఇతర వివరాలు
అప్లికేషన్ల ప్రక్రియ జనవరి 5న ప్రారంభమైంది. ఈ నెల 29న ఆ ప్రక్రియ ముగియనుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా దరఖాస్తు చేసుకోవాలి? తదితర వివరాలను అధికారిక నోటిఫికేషన్లో చూసుకోవచ్చు.
No comments:
Post a Comment