BEL Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. మచిలీపట్నం BELలో ఉద్యోగాలు.. వివరాలివే
BEL Recruitment 2021-22: Apply Online for 6 ITI Apprentices Vacancies in BEL Recruitment 2021-22 in Machilipatnam.
నిరుద్యోగులకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మరో శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నంలోని సంస్థ యూనిట్ లో నియామకాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది.
నిరుద్యోగులకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మరో శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నంలోని సంస్థ యూనిట్ లో నియామకాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఇందు కోసం వాక్ ఇన్ నిర్వహించనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఐటీఐ చేసిన అభ్యర్థులు హాజరుకావాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు సంస్థ కార్యాలయంలో ఏడాది పాటు అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. పరీక్ష పత్రం ఐటీఐలోని సబ్జెక్టుల ఆధారంగా ఉండనుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.8050 స్కాలర్ షిప్ గా అందించనున్నారు.
ఎవరు అప్లై చేయాలంటే..
-ఫిట్టర్, Turner, Machinist, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, R&AC, ఎలక్ట్రీషియన్ విభాగంలో ఈ అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. టెన్త్ పాస్ అవడంతో పాటు ఆయా సబ్జెక్టుల్లో ఐటీఐ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు.
ఎలా దరఖాస్తు చేయాలంటే..
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మొదటగా apprenticeshipindia.org వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకోవాలి. టెస్ట్ కు హాజరయ్యే సమయంలో ఆ ప్రింట్ కాపీతో పాటు విద్యార్హతల సర్టిఫికేట్లు వెంట తీసుకురావాల్సి ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 17న ady Ampthil Government Junior College, Ramanaidu Peta, Machilipatnam 521001 చిరునామాలో ఇంటర్వ్యూకు హాజరు కావాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇతర వివరాలను నోటిఫికేషన్లో చూసుకోవచ్చు.
No comments:
Post a Comment