BARC Recruitment 2021: నిరుద్యోగులకు BARC గుడ్ న్యూస్.. ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్.. వివరాలివే..
వరుసగా ఉద్యోగ ప్రకటనలు ఇస్తున్న Bhabha Atomic Research Centre(BARC), మైసూర్ తాజాగా నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. 47 stipendiary ట్రైనీ ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రకటన విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం నిబంధనలకు అనుగుణంగా వీరిని పర్మినెంట్ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు వారి పోస్టులు, విద్యార్హతల ఆధారంగా వేతనం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయ్యింది.
ఎవరు దరఖాస్తు చేయాలంటే..
బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వారి కోసం ఒక పోస్టును కేటాయించారు. ఇంజనీరింగ్ లో మూడేళ్ల డిప్లొమో కోర్సు చేసిన వారి కోసం మూడు పోస్టులు ఉన్నాయి. మెకానికల్ విభాగంలో డిప్లొమో చేసి 60 శాతం మార్కులు సాధించిన వారి కోసం 2 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రికల్ విభాగంలో డిప్లొమో చేసిన వారి కోసం రెండు పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో మరో మూడు పోస్టులను భర్తీ చేస్తున్నారు. కెమికల్ ప్లాంట్ ఆపరేటర్ పోస్టులను 8 భర్తీ చేస్తున్నారు.
ఫిట్టర్ పోస్టులు 14, ఎలక్ట్రానిక్ మెకానిక్-5, ఎలక్ట్రికల్ 3, కార్పెంటర్ 1, Draughtsman (Civil)-1, Draughtsman (Mechanical)-2, Mason విభాగంలో రెండు పోస్టులను భర్తీ చేస్తున్నారు. పూర్తి విద్యార్హతలు, ఇతర వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 22 ఆఖరి తేదీ.
No comments:
Post a Comment