ఏపీలో 18, 20 తేదీల్లో జాబ్ మేళా.. 250 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు.. వివరాలివే
apssdc.in: SYNERGIES CASTINGS LTD సంస్థలో 250 ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేశారు.
ఏపీలోని నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో సారి భారీ నియామకాలకు ఏపీఎస్‌ఎస్‌డీసీ మరో ప్రకటన విడుదల చేసింది. పూర్తి వివరాలు https://www.apssdc.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
ట్రెనీ విభాగంలో 150 ఖాళీలు:
వైజాగ్ కు చెందిన SYNERGIES CASTINGS LTD సంస్థలో 250 ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. ట్రైనీ, ఆపరేటర్ ట్రైనీ విభాగంలో ఈ నియామకాలు చేపట్టనున్నారు. ట్రైనీ విభాగంలో మొత్తం 150 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
ఐటీఐ (Turner, Machinist, Fitter, MMTM, CNC, Electrical, Diesel Mech & Foundry Man) విద్యార్హత కలిగిన వారు దరఖాస్తుకు అర్హులు. బ్యాక్ లాగ్స్ లేకుండా 60శాతం మార్కులు సాధించి ఉండాలి. 2018, 19, 20 సంవత్సరాల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు 18-35 ఏళ్లు ఉండాలి. ఈ పోస్టులకు కేవలం పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన అభ్యర్థులకు రూ.9345 వేతనంతో పాటు ఈపీఎఫ్, ఈఎస్‌ఐ సదుపాయాలు కల్పిస్తారు.
ఆపరేటర్ ట్రెయినీ విభాగంలో 100:
ఆపరేటర్ ట్రైనీ విభాగంలో మరో 100 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిప్లొమా(Mechanical, Metallurgy, Automobile and electrical) విద్యార్హత కలిగిన వారు దరఖాస్తుకు అర్హులు. 60 శాతం మార్కులతో పాటు బ్యాక్ లాక్స్ లేని వారు దరఖాస్తు చేసుకోవాలి.
2018, 19, 20 సంవత్సరాల్లో పాసైన వారు దరఖాస్తుకు అర్హులు. వయస్సు 18-35 ఏళ్లు ఉండాలి. కేవలం పురుషులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వారికి నెలకు రూ.10400 వేతనం ఉంటుంది. ఎంపికైన వారు విఖాఖపట్నంలోని దువ్వాడలోని కంపెనీలో పని చేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి కంపెనీ రాయితీపై భోజనం, రవాణా సదుపాయాన్ని కల్పిస్తుంది.
18, 20 తేదీల్లో ఇంటర్వ్యూలు:
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 18, 20 తేదీల్లో సంస్థ క్యాంపస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలి. ఆ రోజు ఉదయం 9లోగా రిపోర్ట్ చేయాలి. ఏమైనా సందేహాలు ఉంటే అభ్యర్థులు 6301046329 నంబరును సంప్రదించవచ్చు. ఇంటర్వ్యూకు వచ్చే సమయంలో విద్యార్హత, అనుభవం సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులను వెంట తీసుకురావాలి.
No comments:
Post a Comment