AP Tenth Exams: టెన్త్ విద్యార్థులకు అలర్ట్.పరీక్షలపై కీలక ప్రకటన చేసిన విద్యాశాఖ మంత్రి.. పూర్తి వివరాలివే
కరోనా నేపథ్యంలో ఈ ఏడాది కూడా పది పరీక్షలు ఉంటాయా? ఉండవా? అన్న సందేహం విద్యార్థులు, తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్ పరీక్షలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కరోనా నేపథ్యంలో గతేడాది అనేక వార్షిక పరీక్షలు రద్దు అయ్యాయి. ఈ ఏడాది సైతం ఇంకా అనేక పరీక్షలపై క్లారిటీ రాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ముఖ్యంగా పది పరీక్షలు ఉంటాయా? ఉండవా? అన్న సందేహం అనేక మందిలో వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్ పరీక్షలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం కీలక ప్రకటన చేశారు.
అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది తప్పనిసరిగా టెన్త్ పరీక్షలు ఉంటాయని స్పష్టం చేశారు.
పరీక్షల షెడ్యూల్ ను మరో వారం రోజుల్లో విడుదల చేస్తామని మంత్రి ప్రకటించారు.
పరీక్ష 11 పేపర్లతో ఉంటుందా? లేదా 6 పేపర్లా? అనే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు.
అయితే.. మే 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు ఉంటాయని తెలుస్తోంది.
Also Read:
No comments:
Post a Comment