Common Eligibility Test: రైల్వే జాబ్స్, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్... ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే
National Recruitment Agency Common Eligibility Test | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం మీ కలా? ఎంత కష్టపడైనా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందాలనుకుంటున్నారా? అయితే నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ-NRA నిర్వహించబోయే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్-CET గురించి తెలుసుకోండి.
కేంద్ర ప్రభుత్వంలోని శాఖలు, ప్రభుత్వ బ్యాంకుల్లో గ్రూప్ బీ (నాన్ గెజిటెడ్), గ్రూప్ సీ (నాన్ టెక్నికల్), క్లరికల్ పోస్టుల భర్తీ కోసం నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ-NRA కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్-CET నిర్వహిస్తుంది. అది కూడా మూడు లెవెల్స్‌లో వేర్వేరుగా ఉంటుంది. అంటే టెన్త్ పాసైనవారికి, ఇంటర్ పాసైనవారికి, డిగ్రీ అర్హత ఉన్నవారికి సెట్ వేర్వేరుగా ఉంటుంది. సెట్‌లో సాధించిన స్కోర్ ఆధారంగా ఐబీపీఎస్, ఆర్ఆర్‌బీ, ఎస్ఎస్‌సీ మొదటి దశను క్లియర్ చేయొచ్చు. ఆ తర్వాత రెండో దశ, మూడో దశ, ఇంటర్వ్యూ లాంటి వాటిని ఐబీపీఎస్, ఆర్ఆర్‌బీ, ఎస్ఎస్‌సీ సొంతగా నిర్వహిస్తాయి. అంటే ఐబీపీఎస్, ఆర్ఆర్‌బీ, ఎస్ఎస్‌సీ నిర్వహించే మొదటి దశ పరీక్ష వేర్వేరుగా కాకుండా కామన్‌గా ఉంటుంది.
నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ-NRA నిర్వహించే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్-CET కోట్లాది మంది యువతకు వరం అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. సెట్‌లో సాధించిన స్కోర్‌కు మూడేళ్ల వేలిడిటీ ఉంటుంది. స్కోర్ పెంచుకోవడానికి గరిష్ట వయోపరిమితిలోపు ఎన్నిసార్లైనా అటెంప్ట్ చేయొచ్చు. ఈ టెస్టుకు కరిక్యులమ్ కూడా కామన్‌గా ఉంటుంది. అంటే వేర్వేరు పరీక్షలకు వేర్వేరుగా చదవాల్సిన అవసరం లేకుండా సెట్ కోసం ఒకే సిలబస్ ప్రిపేర్ అయితే చాలు. సెట్ అన్ని భాషల్లో ఉంటుంది. అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా సెట్ రాయొచ్చు.
ఇక ఎగ్జామ్ సెంటర్ కూడా ఎక్కడ ఉంటుందో అన్న టెన్షన్ అవసరం లేదు. ప్రతీ జిల్లా కేంద్రంలో ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటు చేయనుంది నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ-NRA. అంటే అభ్యర్థులు పరీక్ష రాయాలంటే తమకు దగ్గర్లో ఉన్న జిల్లా కేంద్రానికి వెళ్తే చాలు. దీని వల్ల నిరుద్యోగులకు ప్రయాణ ఖర్చులు తగ్గుతాయి. అంతేకాదు... గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు, ఎక్కువ దూరం ప్రయాణించలేమని భావించే మహిళలు, యువతులు తమకు దగ్గర్లో ఉన్న పరీక్షా కేంద్రంలో ఎగ్జామ్ రాయొచ్చు. వారికి ఉద్యోగావకాశాలు పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
Amazon Great Republic Day Sale: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్లో ఆఫర్ల వెల్లువ.. రూ .2,000 లోపు లభించే 20 గాడ్జెట్లు ఇవే-Click Here
Also Read: SSC CGL Notification 2021
No comments:
Post a Comment