UCILలో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
నిరుద్యోగులకు యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(UCIL) శుభవార్త చెప్పింది జాదుగూడా(Jadhuguda)లో 244 అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ITI లేదా నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్(NCVT) అభ్యర్థులు ఇందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ప్రతీ నెల స్కాలర్ షిప్ అందించనున్నట్లు UCIL తెలిపింది. దరఖాస్తుకు డిసెంబర్ 10 ఆఖరి తేది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తులను పంపించాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ఎవరు దరఖాస్తు చేసుకోవాలంటే
టెన్త్ లో 50 శాతం మార్కులు సాధించిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీలు 45 శాతం మార్కులను కటాఫ్ గా నిర్ణయించారు. ఐటీఐలో 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.
ఖాళీలు:
ఫిట్టర్-80
ఎలక్ట్రిషియన్-80
వెల్డర్(గ్యాస్, ఎలక్ట్రీషియన్)-40
Turner or Machinist-15
ఇన్ స్ట్రుమెంట్ మెకానిక్-10
మెకానిక్ డీసెల్,
మెకానిక్ ఎంవీ-10
కార్పెంటర్-5
ప్లంబర్-4
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేసి, కావాల్సిన దరఖాస్తుల జిరాక్స్ కాపీలను జత చేసి స్పీడ్ పోస్టులో యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు పంపించాల్సి ఉంటుంది. ఇందుకు ఆఖరి తేదీ డిసెంబర్ 10. టెన్త్, ITI లో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ భర్తీని చేపట్టనున్నారు.
No comments:
Post a Comment